క్రైమ్/లీగల్

తిరుపతికి వెళుతూ తిరిగిరాని లోకాలకు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, మే 26: నిత్యం దేవున్ని పూజించే పూజారి ఆపై తిరుపతి శ్రీనివాసుని సన్నిధికి తన భార్యతో బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రమాదం రూపంలో మృత్యువు ఆ పూజారి అయిన దేవులపల్లి పర్వతరావు శాస్ర్తీ(51)ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో మక్కెనవారిపాలెం సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటన్‌పాలెంకు చెందిన ఆలయ పూజారి దేవులపల్లి పర్వతరావు శాస్ర్తీ(51) మృతిచెందగా ఆయన భార్య జానకి, కారు డ్రైవర్ రంగారావుతీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. సూర్యారావుపేట జిల్లా మటన్‌పాలెంకు చెందిన ఆలయ పూజారి దేవులపల్లి పర్వతరావుశాస్ర్తీ తన భార్యతో కలిసి తిరుపతి శ్రీనివాసుని దర్శించుకునేందుకు శనివారం ఉదయం షిప్ట్‌డిజైర్ కారులో బయలుదేరారు. కారును వేగంగా నడుపుతన్న డ్రైవర్ రంగావు మక్కెనవారిపాలెం సమీపంలో అద్దంకి బ్రాంచి కెనాల్ వద్ద యూ టర్న్‌ను గమనించక పోవడంతో యూటర్న్‌లో మలుపు తిరుగుతున్న మరోకారును ఢీకొనే ప్రమాదాన్ని తప్పించేందుకు డ్రైవర్ రంగారావు చేసిన ప్రయత్నం ఈ ప్రమాదానికి కారణమైంది. అతివేగంగా వస్తున్న కారును యూటర్న్‌లో కనిపించిన వాహనాన్ని తప్పించేందుకు చేసిన ప్రయత్నంలో కారు అదుపు తప్పి 20 అడుగుల లోతులో ఉన్న అద్దంకి బ్రాంచి కెనాల్‌లో బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురిలో పర్వతరావు అక్కడికక్కడే మృతిచెందగా మృతుని భార్య జానకి, కారు డ్రైవర్ రంగారావుకు తీవ్రగాయాలు కావడంతో వారిని నామ్ హైవే అత్యవసర వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ప్రమాద విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ హైమారావు, స్థానిక ఎస్సై వై నాగరాజు తమ సిబ్బందితో హుటాహుటీన ఘటనా స్థలిని చేరుకుని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.