క్రైమ్/లీగల్

హంద్రీనీవా కాలువలో పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, ఫిబ్రవరి 16:మండల పరిధిలోని కంబాలపాడు గ్రామం వద్ద ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తూ పడి శ్రీనివాసులు(24) మృతి చెందాడని ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. అనంతపురం నగరంలోని సోమనాథ్‌నగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు అనంతయ్య బోర్‌వెల్స్ మిషన్‌లో వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలో 4 నెలల క్రితం కంబాలపాడు గ్రామం వద్ద జరుగుతున్న హంద్రీనీవా పంప్ హౌస్ పనులు చేసేందుకు వచ్చాడు. ఈ నెల 14వ తేదీ వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంపెనీ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు వారి బంధువులు, స్నేహితుల వద్ద అతడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టడంతో హంద్రీనీవా కాలువలో మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు