క్రైమ్/లీగల్

తిరుమలగిరి హత్య కేసులో వీడిన మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: నగరంలోని తిరుమలగిరి ప్రాంతంలో వృద్దురాలి హత్య కేసు మిస్టరీని టాస్క్ఫోర్స్ నార్త్‌జోన్ బృందం ఛేదించింది. వృద్ధురాలి ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి బంగారం, డబ్బుపై కనే్నసి మరొకరితో కలిసి హత్య చేశాడు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసి 60 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి, రూ.5,200 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో నిరాడి అరుణ్, మాచర్ల సరస్వతి, నిరాడి రాజామణిలు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలగిరిలోని కమలాలయ ఎన్‌క్లేవ్‌లో ప్లాట్ నెం.26లో నివశిస్తున్న జి.సులోచన (66)ను అదే ఇంట్లో పని చేస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరాడి అరుణ్, అతని ఉంపుడుగత్తె మాచర్ల సరస్వతితో కలిసి ఈ నెల 19న హత్య చేశాడు. సులోచన నిద్రిస్తుండగా తలగడతో ముఖంపై అదిమి పట్టి గొంతు నులిమి అరుణ్ హత్య చేయగా, ఆ సమయంలో సులోచన రెండు కాళ్లను కదలకుండా సరస్వతి గట్టిగా పట్టుకుంది. అపస్మారక స్ధితిలోకి వెళ్లిన తర్వాత వంట గదిలో నుంచి కత్తిని తీసుకు వచ్చి ఆమె గొంతు కోసి హతమార్చారు. ఆ తర్వాత అందిన కాడికి బంగారం, డబ్బు తీసుకుని ఇద్దరూ పరారయ్యారు. అరుణ్ దొంగిలించిన బంగారాన్ని అతని తల్లి రాజామణి తీసుకుని భద్రపర్చడంతో ఆమెను కూడా ఈ కేసులో మూడవ నిందితురాలిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసులు తొలుత కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు అరుణ్‌పైన నిజామాబాద్ జిల్లాలో మూడు కేసులు నమోదై ఉన్నట్లు టాస్క్ఫోర్స్ విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, నగదు ఇతర వస్తువులతో పాటు నిందితులను తిరుమలగిరి పోలీసులకు అందజేశారు.