క్రైమ్/లీగల్

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, మే 26: జిల్లా వ్యాప్తంగా నకిలి విత్తనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతుంది. పత్తిపంటల నష్టం నుంచి రైతులు నష్టపోకుండా, ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందం పలు చోట్ల నకిలి విత్తనాలను పట్టుకోవడం, నిందుతులపై కేసులు నమోదు చేయడం జరుగుతున్న నకిలి విత్తనాల అమ్మకాలు యదేచ్చగా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం మల్దకల్ మండలం తాటికుంటా గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు పశువుల పాకంలోని 56 సంచుల నకిలి పత్తి విత్తనాలు నిల్వ చేసుకున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో అమాయక రైతులకు ఒక ప్యాకెట్‌కు రూ.500-1000 వరకు అమ్మడానికి సిద్దంగా ఉంచిన నకిలి పత్తి విత్తనాలను ఎట్టకేలకు టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి,వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు శ్రీలత గ్రామానికి చేరుకొని నకిలి పత్తి విత్తనాలకు ఎలాంటి దృవపత్రాలు లేకపోవడంతో మల్దకల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారం జరిగి గత రెండు రోజులైన వ్యవసాయ అధికారులు, పోలీసులు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు దారతీస్తుంది. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు చేపడుతన్న కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.
మల్దకల్ మండలం నకిలీ పత్తి విత్తనాలకు అడ్డగా మారిందని, సీడ్‌పత్తి ఆర్గనైజర్లు ప్రమేయంతో అమాయక రైతుల వద్ద నకిలి పత్తి విత్తనాలు భద్రపరిచి, తమ వ్యాపారం కొనసాగిస్తున్నారని పలువురు రైతులు అంటున్నారు. లక్షలాది రుపాయలు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా ఎదో ఒక గ్రామంలో పట్టుబడుతున్న వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని, నకిలి విత్తనాల బారి నుంచి రైతులను మోసపోకుండా కాపాడవలసిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఈ వ్యాపారం కొనసాగుతుందని పలు గ్రామాల రైతులు తెలిపారు. ఏ మండలంలో లేని విధంగా మల్దకల్ మండలంలో బడా సీడ్‌పత్తి ఆర్గనైజర్లు ఉండటం వల్ల నకిలి విత్తనాల వ్యాపారం కూడ అదేవిధంగా కొనసాగుతుంది.