క్రైమ్/లీగల్

అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు/కర్నూలు, ఫిబ్రవరి 16:పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పఠాన్ హనీఫ్‌ఖాన్(50) వారం రోజుల క్రితం అదృశ్యం కాగా, శుక్రవారం కర్నూలు సమీపంలోని హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. వారం రోజుల క్రితం కర్నూలుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన పఠాన్‌ఖాన్ ఆ రోజు నుంచి కన్పించకుండాపోవడంతో అతడి కుటుంబీకులు ఈ నెల 11వ తేదీ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తుండగా కర్నూలు సమీపంలోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద హంద్రినీవా కాలువలో శవమై తేలినట్లు పోలీసులు గుర్తించారు. శవంపై తీవ్ర గాయాలు వుండడంతో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి కాలువలో పడవేసి వుంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.