క్రైమ్/లీగల్

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, ఫిబ్రవరి 16: మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన యువ రైతు బొంత వీరయ్య(28) తనకున్న మూడెకరాలతో పాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది తన వ్యవసాయ పొలం వద్ద గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం ఆస్పత్రిని సందర్శించి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందజేయాలని కలెక్టర్‌ను కోరారు. వ్యక్తిగతంగా తాను కూడా అన్ని విధాల ఆదుకుంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జూకూరి రమేష్, కినె్నర అంజయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. అదే విధంగా జడ్పీటీసీ తండు సైదులుగౌడ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.