క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో గిరిజనుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ టౌన్, మే 28: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన మెస్రం కిషన్ (50) అనే గిరిజనుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందిన సంఘటన అలజడి రేపింది. కిషన్ తన మోటార్ సైకిల్‌పై కేఆర్‌కే కాలనీ నుంచి పట్టణానికి ఆదివారం సాయంత్రం వస్తుండగా ఎస్పీ క్యాం పు కార్యాలయంకు వెళ్లే దారిలో ఎదురుగా వస్తున్న పోలీసు జీపును ఢీకొనడంతో తీవ్రరక్తస్రావంతో అక్కడికక్క డే మృతిచెందాడు. అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే గిరిజనుడు మృతి చెం దాడని ఆరోపిస్తూ ఆదివాసీ సంఘా లు సోమవారం రిమ్స్ ఎదుట రాస్తారోకో నిర్వహించాయి. సుమారు 40 నిమిషాల పాటు జాతీయ రహదారి పై రాస్తారోకో చేసి, పోలీసు డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ నర్సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సద్ధుమనిగే లా చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వా రంతా ఆందోళన విరమించారు.

ఆవులను తరలిస్తున్న ముఠాపై టాస్క్ఫోర్సు దాడి
* 5 డీసీఎం వ్యాన్లు, బొలేరో, పికప్ స్వాధీనం
మంచిర్యాల, మే 28: అక్రమంగా ఆవులను తరలిస్తున్న ముఠాను సోమవారం రామగుండం కమీషనరేట్ పరిధిలోని టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లుగా సి ఐ బుద్దెస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజిత్ దుగ్గల్ అదేశాల మేరకు పక్కా సమాచారంతో మంచిర్యాల జిల్లాలను హాజీపూర్ శివారులోని జాతీయ రహదారిపై దాడి చేయగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి జగిత్యాల జిల్లా చిలువ కోడూర్‌కు భారీ మొత్తంలో ఆవులను తరలిస్తున్న వాహనాలను నిలిపి వేసి సోదా చేయగా ఆ వాహనంలో 130 ఆవులు, 22 ఎద్దులు ఉన్నాయి. ఆవులు , ఎద్దులతో పాటు 5 డిసి ఎం వ్యాన్‌లు, ఒక బోలేరో ఫికప్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకోని 12 మంది నిందితులను పట్టుకోని హాజీపూర్ ఎస్సైకి అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ఫోర్సు ఏస్సై సమ్మయ్య, కానిస్టేబుల్ సంపత్‌కుమార్, భాస్కర్, శ్యాంసుందర్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.