క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో ఆలయ ఈవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్: ఆలయ సిబ్బంది వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి చెరుకు జయశంకర్ అడ్డంగా దొరికిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీబుగులు వెంకటేశ్వరస్వామి ఆలయ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. చిల్పూర్‌గుట్ట శ్రీబుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైద్య గోపాల్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ గత కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దేవాదాయశాఖ ఆదేశాల మేరకు మృతి చెందిన వ్యక్తి కుమారుడైన వైద్య మహేశ్‌కు ఆలయంలో తాత్కాలికంగా ఉద్యోగం చేసే విధంగా ఆర్డర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా, మృతి చెందిన ఆల య ఉద్యోగి గోపాల్‌కు దేవాదాయశాఖ నుండి రావాల్సిన పరిహారం రూ. 2లక్షల 25 వేలను చెక్కు రూపేణా ఆలయ ఈఓకు పంపించారు. అంతేకాకుండా తాత్కాలికంగా ఆలయంలో ఉద్యోగం చేస్తున్న మహేశ్‌కు దేవాదాయశాఖ పూర్తిస్థాయి ఉద్యోగిగా గుర్తిస్తూ ప్రోసీడింగ్ కాపీని సైతం ఆలయ ఈఓకు పంపించారు. ఇదే అదనుగా భావించిన ఆల య ఈఓ జయశంకర్ మహేశ్‌ను తన కార్యాలయానికి పిలిపించి నీకు చెక్కుతో పాటు, పర్మినెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పినట్లు వారు తెలిపారు. అందుకు చెక్కుకు రూ. 25వేలు, ఉద్యోగ నియామకానికి రూ. 25వేలు లంచంగా ఇవ్వాలని ఈఓ జయశంకర్ మహేశ్‌ను డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. దాదాపు రెండు నెలలుగా ఇబ్బంది పెడుతుండగా తట్టుకోలేని మహేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఆలయ పరిసరాల్లో నిఘా పెట్టిన అధికారులు ఈఓకు రూ. 50 వేలు ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. జయశంకర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆలయ కార్యాలయంలో పూర్తిస్థాయి సోదాలు నిర్వహించి, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక హన్మకొండలో ఉన్న జయశంకర్ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. సోదాల అనంతరం అవినీతి నిరోధక శాఖ కోర్టులో జయశంకర్‌ను హాజరుపర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఆయనతో పాటు సీఐలు సతీష్, వెంకట్, క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు.

చిత్రం..లంచం తీసుకుంటూ ఏసీడీ అధికారులకు చిక్కిన చిల్పూర్‌గుట్ట ఆలయ ఈవో జయశంకర్