క్రైమ్/లీగల్

రైలుకింద పడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో మంగళవారం రైలుకింద పడి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను కాలప్ప(25), గాది లింగమ్మ(23), ఆమె కుమారుడు హర్షవర్ధన్(7)గా గుర్తించారు. కాలప్ప, లింగమ్మ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. మృతుల బంధువులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా తిమ్మాలపురం గ్రామానికి చెందిన హనుమంతప్ప, సుంకమ్మ దంపతుల కుమారుడు కాలప్పకు నెల క్రితం అనకనహాల్‌కు చెందిన మహిళతో వివాహమైంది. అదే గ్రామంలో ఉంటున్న హనుమంతరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల కూతురు గాది లింగమ్మకు ఏడేళ్ల క్రితం అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన తిప్పయ్యస్వామితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు అమృత్, హర్షవర్దన్. కాలప్ప, లింగమ్మ వరుసకు అన్నాచెల్లెల్లు అవుతారు. అయితే మంగళవారం ఉదయం కాలప్ప, లింగమ్మ, ఆమె చిన్న కుమారుడు హర్షవర్దన్ ఆదోని సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి వెంట లింగమ్మ పెద్దకుమారుడు అమృత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బాలుడి ఆచూకీ తెలియలేదు. లింగమ్మ రెండు రోజుల క్రితం పుట్టింటి నుంచి తిరిగి భర్త వద్దకు వెళ్లినట్లు సమాచారం. అయితే మంగళవారం ఆదోని సమీపంలో కాలప్ప, లింగమ్మ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే మృతుల తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.