క్రైమ్/లీగల్

అక్రమ మార్గాల్లో పర్మిట్లకు ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: భారతీయ ఎయిర్ ఆసియా వెంచర్‌కు అంతర్జాతీయ లైసెన్సులు పొందేందుకు అక్రమమార్గాల్లో ప్రయత్నించారనే అభియోగంపై ఎయిర్ ఆసియా గ్రూప్ సిఇవో టోనీ ఫెర్నాండెజ్‌పై సిబిఐ కేసు నమోదు చేసింది. మలేసియా ఎయిర్ ఎసియా బెర్హాడ్ సంస్థ మాజీ డిప్యూటీ సిఇవో తరమలింగం కనగలింగం, ఎయిర్ ఆసియా డైరెక్టర్ ఆర్ వెంకట్‌రామన్‌తో పాటుయిర్సియా, ఎయిర్ ఆసియా బెర్హాడ్ కంపెనీలపై సిబిఐ కేసులు నమోదు చేసింది. వీరిపై ఐపిసి 120-బి, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2), 13(1) (డి) కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరులో ఐదు ప్రదేశాల్లో నిందితుల ఇండ్లలో సిబిఐ సోదాలు నిర్వహించినట్లు సిబిఐ అదికారి ఆర్‌కె గౌర్ చెప్పారు. చట్టబద్ధమైన అనుమతులు పొందేందుకు నిందితుడువెంకటరామన్ ప్రయత్నించారని సిబిఐ తెలిపింది. విదేశీ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్సులను పొందేందుకు అడ్డదార్లు తొక్కారని సిబిఐ పేర్కొంది. అంతర్జాతీయ లైసెన్సు పొందాలంటే కంపెనీకి ఐదు సంవత్సరాల అనుభవం, 5/20 రూల్‌కు లోబడి 20 విమానాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం ఈ సంస్థకు 18 విమానాలు మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని, లోతైన విచారణ తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని సిబిఐ పేర్కొంది.