క్రైమ్/లీగల్

రేపిస్టుకు మరణశిక్షపై సుప్రీం స్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: మధ్యప్రదేశ్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి ముద్దాయికి హైకోర్టు విధించిన మరణశిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఈమేరకు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, మోహన్ ఎం శాంతన్‌గౌడర్‌తో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది బాలికపై అత్యాచారం చేసి హత్యచేశారు. రేపిస్ట్ సతీష్‌కు కింది కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు ధృవీకరించింది. దీంతో ముద్దాయి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.‘ మరణశిక్షపై స్టే ఇచ్చాం. అలాగే మధ్యప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేస్తాం’అని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులోమరొక ముద్దాయి భాగ్వానీకీ మరణశిక్ష పడగా గత వారం సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది. రేపిస్టులిద్దరికీ ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీన్ని హైకోర్టు నిర్ధారించింది. ముద్దాయిలిద్దరూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లగా స్టే ఇచ్చింది. ఇలాంటి సంఘటనల్లో నిందితులకు కఠిన శిక్ష పడకపోతే కోర్టుల పట్ల విశ్వాసం పోవడమేకాదు, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సతీష్, భాగ్వానీ గత ఏడాది ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 14-15 తేదీల్లో తల్లిదండ్రులతో ఉండగా బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ఆనక ఆమెను హత్య చేశారు. రాత్రివేళ తల్లిదండ్రులతో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె అదృశ్యమైంది. మర్నాడు ఉదయం బాలిక మృతదేహం లభించింది. ఘాతుగానికి పాల్పడిన ఇద్దరు నిందితులు గ్రామం విడిచి పారిపోయారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుపై దర్యాప్తుప్రారంభించిన పోలీసులు నిందితులు ఇద్దర్నీ అరెస్టు చేశారు. రేపిస్టులిద్దరికీ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ధృవీకరించగా సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది.