క్రైమ్/లీగల్

నాటు తుపాకులతో సంచరిస్తున్న ఐదుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 29: నాటు తుపాకులు, నాటు బాంబులు తదితర ఆయుధాలు కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులను సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సిరిసిల్ల రాజన్న జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ మసీదు వద్ద ఆయుధాలతో సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో వెళ్ళగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి మూడు నాటు తుపాకులు, 47 నాటు బాంబులు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయన వారిలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ముషీర్‌నగర్ గ్రామానికి చెందిన పిపారత్ జబ్బార్ అలియాస్ జాబ్రు, కోనరావుపేట మండలం ధర్మారానికి చెందిన పిట్టల అంజయ్య, కోనరావుపేటకు చెందిన సుతారి శ్రీనివాస్, సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన గౌరవేని రాజయ్య, సిరిసిల్ల అంబేద్కర్‌నగర్‌కు చెందిన జెట్టి బాలరాజులు ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని విలేఖరుల సమావేశంలో హాజరు పర్చిన ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, లేదా ప్రోత్సాహం అందించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చట్టవ్యతిరేక ఎలాంటి చర్యల సమాచారం అందించాలంటే మీ దగ్గరలోని పోలీసులకు కానీ, లేదా జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన ఫిర్యాదు పెట్టెలలో ఉత్తరాల రూపంలో పోలీసు శాఖకు సమాచారం అదించాలని కోరారు. శాంతి భద్రతల సంరక్షణలో ప్రజల పాత్ర కూడా చాలా కీలకమైందని ఈ సందర్భంగా వెల్లడించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎటువంటి భయం లేకుండా సమాచారం అందించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా వెల్లడించారు.