క్రైమ్/లీగల్

ఆదాయానికి మించిన ఆస్తులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 31: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు మరో తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాన్న ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ గ్రేడ్-2 అధికారి దొడ్డిగర్ల ముక్తేశ్వరరావు ఇల్లు, బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో సుమారు కోటిన్నర విలువైన ఆస్తులు గుర్తించారు. వీటి బహిరంగ మార్కెట్ విలువ భారీగానే ఉంటుందని సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఎసిబి అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎసిబి డిజిపి ఆర్‌పి ఠాకూర్‌కు అందిన ప్రాధమిక సమాచారంపై అభియోగం ఎదుర్కొంటున్న ముక్తేశ్వరరావుపై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. రాజమండ్రి ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొందిన అధికారులు బృందాలుగా ఏర్పడి గురువారం దాడులు నిర్వహించారు. స్థానిక విద్యానగర్‌లోని ముక్తేశ్వరరావు ఇంటిపై ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ, సీఐలు యూజే విల్సన్, కె శ్రీనివాస్, సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం పక్కనే 650 గజాల్లో నాలుగు ఫ్లోర్లతో నిర్మించిన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక్కడ నుంచి రూ.కోటి విలువైన భవనాలు, పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, మూడు లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, ఏడు లక్షల రూపాయల నగదు, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నూతనంగా నిర్మించిన ఇంటిలో కన్స్యూమర్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అలాగే రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ముక్తేశ్వరరావు పనిచేస్తున్న జంగారెడ్డిగూడెం ఎంఎల్‌ఎస్ పాయింట్, గోపాలపురంలోని ఆయన బంధువుల ఇళ్లు, వేగేశ్వరపురంలోని పొగాకు బేరన్లలో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు చెందిన బ్యాంకు లాకర్లు, డిపాజిట్ల వివరాలను తీసుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కూడా సేకరిస్తున్నారు. కాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్న అభియోగంపై ముక్తేశ్వరరావును అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపారు.

చిత్రం..ముక్తేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, నగదు (ఇన్‌సెట్‌లో ముక్తేశ్వరరావు)