క్రైమ్/లీగల్

కార్గిల్ లేక్‌లో పడి ఏసీబీ బాధితుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 15: రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మందాడి గోపాల్‌రెడ్డి(56) గురువారం సిరిసిల్ల కార్గిల్ లేక్‌లో శవమై తేలాడు. కొంత కాలం క్రితం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖకు లంచం తీసుకుంటూ పట్టుబడిన గోపాల్‌రెడ్డి, ఇటీవలే తిరిగి డ్యూటీలో చేరి ప్రస్తుతం వేములవాడ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. సిరిసిల్ల వాస్తవ్యుడైన గోపాల్‌రెడ్డి బుధవారం ఉదయం ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. గురువారం స్థానిక కార్గిల్ లేక్ చెరువులో శవమై తేలాడు. అయితే తొలుత గుర్తు తెలియని వ్యక్తిగా భావించి పైకి తీసిన అనంతరం గోపాల్‌రెడ్డిగా గుర్తించారు. చెరువులో ఎలా పడి మృతి చెందింది వివరాలు తెలియరాలేదు. ప్రమాద స్థితిలో మృతి చెందాడా లేక అనుమానాస్పదంగా మృతి చెందాడా అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది. మూడేళ్ళ క్రితం ఏసీబీకి పట్టుబడిన అనంతరం అరెస్టై అనంతరం సస్పెన్షన్‌లో కొనసాగిన గోపాల్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిసింది. మృతుడి భార్య రాధ ఫిర్యాదులో తన భర్త బుధవారం ఇంటి నుండి వెల్ళాడని, గురువారం పోలీసులు వచ్చి సమాచారం ఇచ్చారన్నారు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.