క్రైమ్/లీగల్

బోధ్ గయ పేలుళ్ల కేసులో ఐదుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 1: బీహార్‌లోని బోధ్ గయలో 2013లో జరిగిన పేలుళ్ల ఘటనలో ఐదుగురు ఉగ్రవాద అనుమానితులకు జీవిత ఖైదుతో పాటు రూ. రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) జడ్జి మనోజ్ కుమార్ సిన్హా తీర్పు ఇచ్చారు. ఇం తియాజ్ అన్సారి, హైదర్ అలీ, ముజిబ్ ఉల్లా, ఒమైర్ సిద్ధిఖీ, అజారుద్దీన్ ఖురేషి పేలుళ్లకు బాధ్యులుగా కోర్టు నిర్ధారించింది. ఈ ఐదుగు రు దోషులను కోర్టు గత నెల 25న తేల్చింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా బోధ్ గయకు పేరుంది. పాట్నాకు 90 కి.మీ దూరంలో ఉన్న బోధ్ గయలో పేలుళ్లు 2013 జూలై 7న జరిగా యి. ఈ ఘటలో చాలామంది బౌద్ధ సన్యాసుల కు గాయాలయ్యాయి. పేలుళ్ల ఘటనలో ఎవ రూ మృతి చెందలేదు. మరో నిందితుడు తాఫి క్ అహ్మద్ మైనర్ అయినందు వల్ల జువెనైల్ కోర్టు మూడేళ్ల శిక్షను గతంలో విధించింది.