క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, ఫిబ్రవరి 16: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కనపర్తి గ్రామానికి చెందిన మునిగాల రాజసమ్మయ్య (60) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో గత ఏడాది మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాల్లోనే మిర్చిని తగులబెట్టాడు. మళ్లీ ఈ ఏడాది కూడా అప్పులు తెచ్చి మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. అయితే, దిగుబడి లేకపోవడం.. పెట్టుబడి కోసం తెచ్చిన ఆరు లక్షల రూపాయల అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై రాజసమ్మయ్య ఇంట్లో గురువారం రాత్రి ఉరివేసుకుని మృతిచెందినట్లు ఎస్సై సదాకర్ తెలిపారు. మృతుడి భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు ఉన్నారు.