క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవడుగూరు, జూన్ 5 : మండల పరిధిలోని రావులుడికి గ్రామానికి చెందిన చెన్నమ్మ (60) మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూలేని సమయంలో విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు, భర్త గోవిందురెడ్డి గుర్తించి వెంటనే అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. చెన్నమ్మ రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మానసిక వ్యథకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.
నీటి గుంటలో మునిగి బాలుడి మృతి
బొమ్మనహాళ్, జూన్ 5 : మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన వడ్డే తిమ్మారెడ్డి కుమారుడు వడ్డే వంశీ (06) నీటి గుంటలో మునిగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వేదవతి నది పారింది. ఈ నీటిని చూసేకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు, ఒక బాలుడు వర్షం నీటిలో ఈతకు వెళ్లగా ప్రమాదం సంభవించింది. అయితే బాలికలు బయటపడినా, బాలుడు మాత్రం నీటిలో మునిగి మృతి చెందాడన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
మడకశిర, జూన్ 5 : పట్టణంలోని శివాపురానికి చెందిన శ్రీరాములు (45) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివాపురంలో నివాసం ఉంటున్న శ్రీరాములు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినా నయం కాలేదు. అయితే మంగళవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై లింగన్న ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.