క్రైమ్/లీగల్

ఇల్లు కొనిస్తానని మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి ఫిబ్రవరి 16: స్నేహితునిగా నటిం చి ఇల్లు కొనిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.21లక్షలు కాజేసిన సంఘటన శంకర్‌పల్లిలో జరిగింది. చేవెళ్ల ఏసీపీ టీ.స్వామి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని సింగాపురం, క్రిస్టల్ కాలనీలో మున్నూరు జగదీశ్వర్ తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. కాగా శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్, గోపీనగర్ కాలనీకి చెందిన గడ్డమీది సాయిగౌడ్‌తో జగదీశ్వర్‌కు ఆరు నెలల క్రితం స్నేహం ఏర్పడింది. సాయిగౌడ్ అక్క.. జగదీశ్వర్ ఇంటి ముందున్న ఇంట్లో అద్దెకు ఉంటోంది. అక్క వద్దకు తరచూ వస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం బాగా పెరిగింది. జరదీశ్వర్‌కు చెందిన ప్లాటు నాలుగు నెలల క్రితం అమ్మగా వచ్చిన రూ.21 లక్షలు ఇంట్లో దాచారు. కాగా ఈ డబ్బుతో మరో స్థలం లేదంటే ఇల్లు కొనాలని కుటుంబ సభ్యు లు నిర్ణయించుకున్నారు. చందానగర్‌లో ఓ ఇల్లు అమ్మకానికి ఉందని సాయిగౌడ్ తెలిపాడు. సాయిగౌడ్, జగదీశ్వర్ తండ్రి విఠలయ్య ఇద్దరు కలిసి నవంబర్ 3న పాపిరెడ్డినగర్ కాలనీకి వెళ్లా రు. మధ్యవర్తిగా సాంబయ్యని పరిచయం చేశా డు. నాగలక్ష్మి ఇంటిని చూపించగా రూ. 23.50 లక్షలకు కొనడానికి అంగీకరించారు. రెండు విడతలుగా రూ.15లక్షలు ఇచ్చారు. జగదీశ్వర్ వద్ద ఉన్న మరో ఆరు లక్షలు అల్మారాలో దాచుకున్నా డు. ఆరు లక్షల రూపాయలనూ కాజేయాలని సాయిగౌడ్ తన స్నేహితులైన ఆయాజ్, సునీల్, నాందేవ్‌ను జగదీశ్వర్ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేశాడు. స్నేహితులను ముగ్గురిని పురమాయించి చోరీ చేసి ఒకొక్కరూ రూ.2లక్షలు పంచుకున్నారు. జగదీశ్వర్‌ను పటాన్‌చెర్వుకు పిలిపించి చంపాలని పథకం వేశారు. పని ఉండడంతో జగదీశ్వర్ అక్కడికి వెళ్లలేదు. 2018 ఫిబ్రవరి 2న పోలీస్‌స్టేషన్‌లో జగదీశ్వర్ ఫిర్యాదు చేశాడు. సాయిగౌడ్ నుంచి ఐదు తులాల బంగారం, జత వెండి పట్టగొలుసులు, నాలుగు సెల్‌ఫోన్లు, వెంటో కారు, సోనీ కెమెరా, రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు, పల్సర్ బైక్, ఎల్‌సీడీ టీవీ, ఊఫర్, ఆంప్లిఫయర్, రూ.51 వేలు, అయూజ్ నుంచి రూ.61వేలు, సెల్‌ఫోన్, సునీల్ నుంచి ఆపిల్ సెల్‌ఫోన్, నాందేవ్ నుంచి పల్సర్ బైక్, సెల్‌ఫోన్, రూ.2 లక్షల నగదు, సాంబయ్య నుంచి సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వస్తువులు, నగదు రూపేణా రూ.16 లక్షలు రికవరీ అయ్యాయని, నేరస్థులను 15 ఫిబ్రవరిన అరెస్టు చేసి 16న కోర్టుకు పంపామని ఏసీపీ చెప్పారు. మిగతా ప్రాపర్టీ రికవరీ చేయడానికి, నేరస్థులను పోలీస్ కస్టడీకి తీసుకుంటామని చేస్తామని తెలిపారు. నేరస్థులను అరెస్టుచేసి ప్రాపర్టీని రికవరీ చేసిన ఇన్‌స్పెక్టర్ కే.శశాంక్ రెడ్డి, సిబ్బందిని ఏసీపీ తెలిపారు.