క్రైమ్/లీగల్

కొండాపూర్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 16: కొండాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వ్యక్తి.. పీకలదాక మద్యం సేవించి అతివేగంగా వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టాడని స్థానికలు చెప్పారు. కారు యజమానిని పోలీసులు కాపాడేందుకు, నిందితుని వివరాలు గోప్యంగా ఉంచేందుకు విశ్వప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ నుంచి మసీదుబండ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు.. శ్రీరాంనగర్ కాలనీవద్ద డివైడర్‌ను, ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఇన్నోవా వాహనం ముందు వెళ్తున్న హోండా సిటీ కారును ఢీకొట్టింది. హోండా సిటీ, ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
హోండా సిటీ కారులోని ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండటంతో మరో వాహనంలో వెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఎండబ్ల్యూ కారు నడుపుతున్న వ్యక్తి పీకలదాకా మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత నిందితుడు పారిపోయాడని, గోల్డెన్ హోటల్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గచ్చిబౌలి సీఐ గంగాధర్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.