చిత్తూరు

ప్రజాద్రోహులు చంద్రబాబు, వెంకయ్యనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 19: తమ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ద్రోహులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు అని నగరి శాసనసభ్యులు రోజా విమర్శించారు. సోమవారం కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకొని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో అధిష్టానంలోకి మిత్ర పక్షమైన బిజెపిని ఒప్పించి ప్రత్యేకహోదా తీసుకువస్తామని ప్రజలను యామార్చారన్నారు. నేడు ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు కేంద్రం తానా అంటే తాను తందానా అని అంటున్నారని యద్దేవా చేసారు. ప్రత్యేక హోదా కోసం నాటి నుండి నేటి వరకు పలు ఆందోళనలు చేపడుతున్నది వైకాపా పార్టీనే అన్నారు. నెల్లూరు నాయుడు, చిత్తూరు నాయుడు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని రెండుసార్లు ఢిల్లీకి పంపినా ఏమి చేసారని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీటి పర్వంలో కాంగ్రెస్‌పార్టీ తుడుచుకుపోయిందని తెలిపారు. ఈకార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, మండల అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, యాదమరి మండల అధ్యక్షుడు ధనంజయరెడ్డి, కుమార్‌రాజా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.