చిత్తూరు

యుపి ఎన్నికలతో తేలనున్న మోదీ భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 19: త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలని తిరుపతి మాజీ ఎంపి డాక్టర్ చింతామోహన్ అభిప్రాయపడ్డారు. సోమవారం తొట్టంబేడు మండల కార్యాలయానికి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశంలో రాజకీయంగా పెద్ద మార్పులు జరుగుతాయని చెప్పారు. నరేంద్రమోదీ గుజరాత్‌పై కాకుండా ఉత్తరప్రదేశ్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని, ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఆయన భవిష్యత్తును తేలుస్తాయన్నారు. అవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజి కాకుండా ప్రత్యేక హోదా రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్నదని చెప్పారు. విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తప్పుచేసిందని, దాని ఫలితం అనుభవిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఈ రెండున్నరేళ్లలో దేశంలో, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. జాతీయ రహదారులు, రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం, దుగ్గరాజపట్నం ఓడరేవు, మన్నవరం ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేశామని అన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ బత్తెయ్యనాయుడు, పార్టీ నాయకులు సిద్ధయ్య, రవి, జానీబాషా, వెంకటముని, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.