చిత్తూరు

టిటిడి స్థానిక ఆలయాలు, విద్యాసంస్థల్లో జలప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: టిటిడిలోని స్థానిక ఆలయాలు, విద్యాసంస్థల్లో జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేయాలని టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఇఓ కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ తిరుమలలో రాగి డాలర్లను భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెండి, బంగారు డాలర్లను బుధవారం నుంచి మంగళవారం వరకు వారంరోజుల పాటు ఒకే ధర ఉండేలా స్థిరీకరించాలని సూచించారు. సప్తగిరి మాసపత్రిక క్రమం తప్పకుండా పాఠకులకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన సంపాదకులు డాక్టర్ రాధారమణను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో గదుల ముందస్తు బుకింగ్ చేసుకునే భక్తులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని ఇడిపి అధికారులకు సూచించారు. ఎస్వీబీసీ స్టూడియో భవన నిర్మాణానికి సంబంధించి త్వరలో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. టిటిడి స్థానిక ఆలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినపుడు ఇన్వర్టర్లను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని 2వ సత్రం వద్ద ఉన్న సిఆర్‌ఓ భవనానికి అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి ఆ ప్రాంతంలో వర్షపునీరు నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. తిరుమల నడకదారుల్లో ఉన్న దర్శన టోకెన్ మంజూరు కౌంటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఇఓ ఆదేశించారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఓ పోలా భాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్ ముక్తేశ్వరరావు, ఎఫ్‌ఎ, సిఎఓ బాలాజి, ఎస్‌ఇ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.