చిత్తూరు

దళితులు, గిరిజనులు కమిషన్‌కు రెండుకళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, సెప్టెంబర్ 19: దళితులు, గిరిజనులు కమిషన్‌కు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి అన్నారు. సోమవారం జిల్లా దళిత గిరిజన వేదిక ఆధ్వర్యంలో చంద్రగిరి మండలంలో రాములవారి ఆలయ ఆవరణలో ఆయనకు పౌరసన్మానం చేశారు. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞత తెలుపుతూ ప్రసంగించారు. దళిత విద్యార్థులు విదేశీయ విద్యను అభ్యసించడానికి వీలుగా అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్లాన్ ద్వారా చంద్రన్న బాట కింద దళిత గిరిజన కాలనీలో సీసీ రోడ్లునిర్మాణ పనులను పూర్తిచేస్తున్నామన్నారు. చంద్రగిరి మండలంలో తాటిమాకులకోనలోని గిరిజన కాలనీకి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు మంజూరుకు కమిషన్ కృషిచేస్తుందన్నారు. ఓటేరు దగ్గర నక్కల కాలనీలో సంచార జీవనం గడుపుతున్న గిరిజనులకు కమిషన్ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారి ఈశ్వరయ్య, టిడిపి నాయకురాళ్లు కమలాకుమారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ జాతీయ ప్రతినిధి నిర్మల, ఎల్లయ్య, మనోహర్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.