చిత్తూరు

‘చట్టాలు అమలు బాధ్యత అధికారులదే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొంపిచెర్ల, సెప్టెంబర్ 22: చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా అడిషనల్ జడ్జి ఆదినారాయణ స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన మండల న్యాయసేవా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్భందవిద్య, బాలకార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలు అరికట్టే చట్టాలున్నా వీటిని అరికట్టాల్సిన అధికారులు ఏమి చేస్తున్నారోఅని ప్రశ్నించారు. చట్టాలు అమలు బాధ్యత అధికారుల మీదే కాదని ప్రజలపైన కూడా ఉందని సమాజ శ్రేయస్సుకు ప్రజలు పునరంకితం కావాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు వెళ్ళని కేసులైనా కాగితంలో రాసిస్తే లోక్‌అదాలత్ నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చి పరిష్కరిస్తుందని అన్నారు. లోక్‌అదాలత్‌లో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, వృద్దులు, అనాథలు, మానసికరోగులకు ఉచిత న్యాయం అందిస్తామని తెలిపారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొరస్వామినాయుడు, తహశీల్దార్ వెంకటకృష్ణుడు, ఎస్సై రహీముల్లా, న్యాయసేవా సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యనిర్వహణాధికారి శ్రీదేవి, పోలీసు సిబ్బంది, సిపిఒలు పాల్గొన్నారు.