చిత్తూరు

పల్లకిసేవలో కలిగిరి వెంకన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వర స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెరటాసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారికి వైభవంగా పల్లకిసేవపై ఊరేగింపుకార్యక్రమం నిర్వహించారు. ఆలయప్రధాన అర్చకులు వాసుదేవాచార్యశర్మ వేదమంత్రోశ్ఛరణల మధ్యఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి కలిగిరి వెంకటేశ్వరస్వామి వైభవంగా అభిషేకాలు, అర్చనలు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఉభయ దారులుగా పూతలపట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబీకులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యం చెల్లించారు. అలాగే మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వరస్వామికి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈశ్వర్‌ప్రసాద్, ఇఒ రామచంద్రారెడ్డి, ఎల్‌కెపి ఊరు, వాసుదేవాపురం, సిఆర్ కండిగ, పూతలపట్టు తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.