చిత్తూరు

టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్‌లో ఎస్వీయూకు ప్రపంచ ర్యాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబరు 22: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 27 విశ్వవిద్యాలల్లో పనితీరు ఆధారంగా అంతర్జాతీయ సంస్థ అయిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్వీయూకు ఉత్తమ ర్యాంకు లభించింది. 2016-17 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఎస్వీయూ 601-800 ర్యాంకును సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో భారత దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సరసన ఎస్వీయూ స్థానం దక్కడంతో ఎస్వీయూ వీసీ ఆచార్య ఆవుల దామోదరం, రెక్టార్ ఆచార్య భాస్కర్, రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజుల నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని బిట్స్‌పిలానీ, ఐ ఐటి గౌహతి, ఐ ఐటి రూర్కెలా, ఐ ఐటి బాంబే, ఐ ఐటి కాన్పూర్, కలకత్తా , ఢిల్లీ, పంజాబ్, పూనే విశ్వవిద్యాలయాల సరసన ఎస్వీయూ కూడా చేరింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య దామోదరం మాట్లాడుతూ దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఎస్వీయూను తీర్చిదిద్దుందుకు విశేష కృషి చేసిన బోధన, బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు.
27న మోటార్ సైకిళ్ల బహిరంగ వేలం
తిరుపతి, సెప్టెంబరు 22 : పోలీసులు సీజ్ చేసిన ద్విచక్రవాహనాలను ఈనెల 27న తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు క్రైం పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తిరుపతి మండల తహశీల్దారు ఉత్తర్వుల మేరకు ఈ వేలం వేస్తున్నట్లు తెలిపారు.
వేలంలో పాల్గొనేవారు వాహనాలను పరిశీలించేందుకు తిరుపతి క్రైంపోలీసు స్టేషన్‌లో అందుబాటులో ఉంచామన్నారు.