చిత్తూరు

పరిశ్రమలకు విద్యుత్ సర్వీసు కోసం సాధ్యతా ధ్రువీకరణపత్రం అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: ఎపిఎస్‌పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలు విద్యుత్ సర్వీసుల కోసం ఇకపై సాధ్యతా ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సిన అవసరంలేదని ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ వై దొర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆర్థిక సంస్థలు , బ్యాంకులు, రుణదాతలు సింగిల్స్ డెస్క్ ద్వారా విద్యుత్ సర్వీసును పొందేందుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ నుంచి సాధ్యతా ధ్రువీకరణ పత్రాన్ని పొందడాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో వ్యాపారాభివృద్ధి దృష్ట్యా పెట్టుబడులను ఆహ్వానించడానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు సరఫరా సౌకర్యాన్ని కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు విద్యుత్ సర్వీసును పొందడానికి అవసరమైన విద్యుత్ భద్రతా ధ్రువీకరణ పత్రాన్ని పొందడాన్ని సరళతరం చేస్తూ రాష్ట్ర ఇందన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. గతంలో 50 హెచ్‌పికి మించిన పరిశ్రమలు విద్యుత్ కనెక్షన్‌ను పొందడానికి ముఖ్య విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్‌ను మంజూరు చేసేవారన్నారు. అయితే ఇకపై 50 హెచ్‌పికి మించిన పరిశ్రమలు, 11కిలోఓల్ట్స్‌లో ఉన్న హెచ్ టి పరిశ్రమల యజమాని స్వయంగాగానీ లేదా చార్టర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సహాయంతో స్వయం ధ్రువీకరణపత్రం సమర్పించడం ద్వారా విద్యుత్ సర్వీసును పొందవచ్చన్నారు. విద్యుత్ సర్వీసును పొందడానికి ముందు విద్యుత్ తనిఖీ అధికారితో తనిఖీ చేయించాలా, వద్దా అనే అంశంపై సంబంధిత పరిశ్రమ యజమాని నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారులు విద్యుత్ కార్యాలయంలో తెలుసుకోవచ్చన్నారు.