చిత్తూరు

మన్నవరం బెల్ ప్రాజెక్టు పనులు నెలలోపు ప్రారంభించకుంటే ప్రజా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, సెప్టెంబర్ 22: చిత్తూరు, నెల్లూరు, కడపజిల్లాల్లోని ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఎంతగానో మేలుచేసే మన్నవరం భెల్ ప్రాజెక్టు కు సంబంధించిన రెండోదశ పనులను నెలలోపు ప్రారంభించకపోతే గ్రామస్థాయిలో ప్రజలను చైనత్యం చేసి ఉద్యమిస్తానని, తిరుపతిలో సభ కూడా ఏర్పాటుచేస్తానని తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రస్వరంతో హెచ్చరించారు. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌డిపిసి) భారతీయ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) సంయుక్త్భాగస్వామ్యంతో 6వేల కోట్ల రూపాయలతో యుపిఎ ప్రభుత్వం మంజూరుచేసిన భెల్ ప్రాజెక్టు రెండోదశ పనులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఏర్పేడు మండలం ఎండిఓ కార్యాలయం వద్ద గ్రామస్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భెల్‌ప్రాజెక్టు పూర్తయితే పది వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రైతుల జీవితాలు ఎంతగానో బాగుపడతాయన్నారు. ప్రజులకూడా భెల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యామ్నాయ వాణిజ్య వ్యాపారాలు చేసుకోవడానికి ఎంతగానో దోహదపడి ఆర్థిక స్వావలంబన సాధిస్తారన్నారు. 2010 సెప్టెంబర్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పేడు మండలం మన్నవరంలో భెల్‌ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారన్నారు. ఇందుకు సంబంధించి 800 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి తొలి దశ పనులను పూర్తిచేసిందన్నారు. అయితే అటు తరువాత అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో టిడిపి ఆ పనులను పూర్తిగా నిలిపివేశారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ భెల్ ప్రాజెక్టులో విద్యుత్ పరికరాలు, బ్రాయిలర్లు, కర్బన్లు, ఉత్పత్తి అవుతాయన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక్కో ఉద్యోగం ఇవ్వాలన్నదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అన్నారు. అప్పటి వ్యయ అంచనాల ప్రకారం 6 వేల కోట్ల పనులు ప్రారంభించామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ , రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ కక్షతో నిరుద్యోగులు, నిరుపేదలపై కక్ష సాధించేందుకు ఈ ప్రాజెక్టు పనులు ఆపించారని ధ్వజమెత్తారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా మన్నవరం ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇందుకు సంబంధించి తాను ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతోకూడా మాట్లాడానన్నారు. అసలు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని తేలిందన్నారు. బాబొస్తే జాబొస్తుందన్నారని, ఉన్న జాబులు పోతున్నాయని,
కొత్త పరిశ్రమలకు ఆరాట పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిశ్రమల పనులను పూర్తిచేయకుండా భూస్థాపితం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మోదీ, బాబులు ఇద్దరూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారన్నారు. వీరిద్దరూ ఇచ్చిన మాట తప్పి, నిరుద్యోగ యువతీ యువకులకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. మన బిడ్డల ఉజ్వల భవిష్యత్‌కు, మన ప్రాంత అభివృద్ధికి మోది, బాబుల జోడి తీరని నష్టాన్ని చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి యుపిఎ ప్రభుత్వం ఎప్పుడో ప్రత్యేకహోదా తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగానే మన్నవరం భెల్‌ఫ్యాక్టరీ, దుగ్గరాజుపట్నం ఓడరేవు, శ్రీకాళహస్తి- నడికుడి రైల్వేస్టేషన్ 300 పడకల కాన్పుల ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, 7009 రెండు బెడ్‌రూమ్‌లు, ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలపై కక్ష కట్టినట్లుగా ప్రజాహిత కార్యక్రమాలను ఆపి ద్రోహపూరిత చర్యకు తెగబడిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలనుంచి వస్తున్న ఆగ్రహ జ్వాలలను గుర్తించి నెలలలోగా మన్నవరం పనులు పునఃప్రారంభించి, బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 బడ్జెట్‌లు పూర్తయ్యాయని, ఇక ఉన్నది 2 బడ్జెట్లేనని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపైన, నిరుద్యోగ యువతపైన, రైతులపైన కక్ష సాధింపచర్యలువీడి పనులు ప్రారంభించాలని డిమాండ్‌చేశారు. లేని పక్షంలో తాను ప్రతి గ్రామంలో పర్యటించి నిరుద్యోగ యువతీ యువకుల్లో చైతన్యం తీసుకొస్తానన్నారు. వాడ వాడల సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యం చేసి పాలక ప్రభుత్వాల మెడలువంచి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ బత్తెయ్యనాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్, శాంతియాదవ్, తేజోవతి, మునిలక్ష్మి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.