చిత్తూరు

లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఎప్పటికైనా ప్రమాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు ప్రవహించే లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉండటం ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన తిరుమలకు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్‌లు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన ముందుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అంతకుమునుపు గవర్నర్ శ్రీవారి పుష్కరిణికి వెళ్లి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. అక్కడినుంచి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు ఛైర్మన్, ఉన్నతాధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గవర్నర్ శ్రీవారి మూలవిరాట్‌ను దర్శించుకొని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఉభయరాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించామని చెప్పారు. రెండు తెలుగురాష్ట్రాలలోని హైదరాబాద్, గుంటూరు తదితరప్రాంతాలు భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విషయంపై విలేఖర్లు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో కొంత తీవ్రంగా స్పందించిన గవర్నర్ లోతట్టుప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని ఉండటం ప్రజలకు ప్రమాదమే కదా అని అన్నారు. ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయని విలేఖర్ల ప్రశ్నకు సమాధానంగా మరింత తీవ్రంగా స్పందించిన ఆయన ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితిని గుర్తించి ముందుగానే హెచ్చరించినపుడు దానిని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉండాలి కదా అన్నారు. వర్షాల కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పర్యవేక్షిస్తున్నారని, అధికారయంత్రాంగంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారని, అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రులను నియమించి సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొప్పగా పాలన చేస్తున్నారని కొనియాడారు. వర్షాలు దేవుడు కురిపిస్తాడని, ఇలాంటి సమయంలో కొన్ని అసౌకర్యాలు ప్రజలకు ఏర్పడినమాట వాస్తవమేనని, ప్రజలు కూడా ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటించాల్సిన ధర్మం ఉంది కదా అని ఆయన చెప్పారు. అయినప్పటికీ వచ్చే వర్షాకాలానికి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి భక్తుడికి వాహన సేవల, మూలవిరాట్ దర్శనం కల్పించాలన్నదే అధికారుల లక్ష్యమని, ఆ దిశగా పనిచేస్తున్నారని, ఇది అభినందనీయమన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి నిర్వహించే వాహనసేవలను భక్తులు తిలకించి తరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. శ్రీవారి ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహం వద్ద అదనంగా ఏర్పాటుచేసిన కొప్పెర హుండీ భక్తులకు సౌకర్యవంతంగా ఉందన్నారు. అక్కడనుంచి గవర్నర్ టిటిడి ఇఓ, జెఇఓలతో కలిసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్‌ను సందర్శించారు.