చిత్తూరు

వేదవిద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 25: వేద విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృత ఫలమని, ప్రతి వేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వేద విద్యార్థులకు హితవుపలికారు. ఆదివారం వేద విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. వేదాలను అభ్యసిస్తున్న విధానాన్ని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువులను, తల్లిదండ్రులను ప్రతి విద్యార్థి గౌరవించాలన్నారు. వేదవిద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతఫలమని, వెంకన్న పాదాల చెంత ఏర్పాటైన ఈ వేదవిశ్వవిద్యాలయంలో ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేద విద్య పూర్తిచేసుకున్న వారు సమాజానికి ఉపయోగపడేవిధంగా సేవ చేసినపుడే ఆ విద్యకు సార్థకత చేకూరుతుందన్నారు. అనంతరం వేద విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వేదిక్ వర్సిటీ విసి ఆచార్య దేవనాథన్, రిజిస్ట్రార్ కృష్ణమూర్తి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం
రేణిగుంట, సెప్టెంబర్ 25: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేకవిమానం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోగా సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్లా, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, మునిసిపల్ ఉపకమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లారు.

అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు రేషన్ బియ్యం పట్టివేత
వరదయ్యపాళెం, సెప్టెంబర్ 25: అక్రమంగా తరలిస్తున్న తమిళనాడు రేషన్ బియ్యాన్ని ఆదివారం వరదయ్యపాళెం బస్టాండ్ ఆవరణంలో పోలీసులు వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు. సుమారు 2 టన్నుల 750 కిలోల బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ షేక్‌షావలి తెలిపారు. ఆదివారం ఉదయం బీట్‌లో భాగంగా వరదయ్యపాళెం బస్టాండ్‌లో అనుమానాస్పదంగా ఉన్న లారీని తమిళనాడుకు చెందిన రేషన్‌బియ్యంగా గుర్తించారు. డ్రైవర్ చిన్నాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.