చిత్తూరు

పక్షవాతానికి చికిత్స సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 22: పక్షవాతానికి గురైన రోగులను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే చికిత్స సాధ్యమేనని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు. శనివారం స్విమ్స్ న్యూరాలజీ విభాగం విభాగాధిపతి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్వంలో ‘ అక్యూట్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఇన్ విండో పీరియడ్ ’ అనే అంశంపై నిరంతర వైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షవాతానికి గురైన రోగిని తక్షణం ఆసుపత్రికి తరలించగలిగితే రోగి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. డాక్టర్ బి. వెంగమ్మ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా పక్షవాతం, ఇతర న్యూరాలాజికల్ సమస్యల మూలంగా ప్రతి నిముషానికి ఆరుగురు మృత్యువాత పడుతున్నారని, పురుషులలో ప్రతి ఆరుమంది పేషెంట్లలో ఒకరు మరణానికి గురవుతుండగా స్ర్తిలలో ప్రతి అయిదుగురిలో ఒకరు మరణిస్తున్నారన్నారు. పక్షవాతానికి ఆమె కారణాలు తెలియజేస్తూ హైపర్‌టెన్షన్, డయాబెటిస్, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.నటరాజ, ఎపిడిమియాలజీ గురించి డాక్టర్ ఎస్ వి నవీన్ ప్రసాద్, క్లినికల్ ఫీచర్స్ అండ్ ఇమేజిన్ ఆఫ్ స్ట్రోక్ అనే అంశంపై డాక్టర్ జె.దృశ్యంతబాబు మేనేజ్‌మెంట్ ఆఫ్ స్ట్రోక్ ఇన్ విండో పీరియడ్ అనే అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజంటేషన్‌తోసహా గణాంకాలతో సహా వ్యాధి తీవ్రతకు కారణాలను రోగులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేడియాలజి ప్రొఫెసర్ ఎ.వై లక్ష్మి, ఎం ఎస్ డాక్టర్ సత్యనారాయణ, పి ఆర్వో రాజశేఖర్, సురేష్‌కుమార్, సుందరాజ్, వివిధ వైద్య విభాగాధిపతులు, ప్రెసిండెంట్ డాక్టర్ల పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో ర్యాలీ, రాస్తారోకో
బి.కొత్తకోట: వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్న మదనపల్లె వాణిజ్యపన్నుల శాఖ అధికారి శ్రీనివాసులునాయుడును వెంటనే బదిలీ చేయాలని శనివారం వ్యాపారులు, వైకాపా నాయకులు స్థానిక జ్యోతిచౌక్ నుంచి బెంగుళూరు రోడ్డు, పిటిఎం రోడ్డు, మదనపల్లె వరకు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. అనంతరం దుకాణాలను మూసి వేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్, వ్యాపారస్థుల సంఘం అధ్యక్షుడు శిల్ప రాజేంద్ర, సూర్యమోహన్, కృష్ణారెడ్డి, పెయింటింగ్ సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, కోఅప్షన్ సభ్యుడు బావాజాన్ పాల్గొన్నారు.