చిత్తూరు

పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు పెరిగేందుకు అధికారులు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 25: పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో వారు రెవెన్యూ అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు బాగా తక్కువగా ఉందన్నారు. కావున టీచర్లు అందరూ తప్పకుండా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలన్నారు. నవంబర్ 5న ఓటర్లుగా నమోదుకు ఆఖరు తేదీ అన్నారు. ఓటర్ల నమోదు ఆన్‌లైన్‌లో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో, ప్రతి తహశీల్దార్, ఎంపిడివో కార్యాలయాలలో చేయడం జరుగుతుందన్నారు. మండలాల్లో ప్రక్రియ గురించి ప్రచారం చేయాలని సంబంధిత ఎలక్షన్ అధికారులను ఆదేశించారు. పట్ట్భద్రులకు ఫారం 18, ఉపాధ్యాయుల ఫారం 19లో వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల నమోదుకు ఆన్‌లైన్‌లో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో లేదా తహశీల్దార్లు, ఎంపిడివో, ఎంఇఓ లేదా మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత ఫారం పొంది నమోదు చేసుకోవచ్చన్నారు. పట్ట్భద్రుల, ఉపాధ్యాయుల నమోదు షెడ్యూలు, నమోదుకు దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ నవంబర్ 5, డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్స్ తయారు నవంబర్ 19, ఎలక్ట్రోరల్ రోల్స్ డ్రాప్ట్ పబ్లికేషన్ నవంబర్ 23, క్లెయింలు, ఆబ్జక్షన్స్ నమోదుకు నవంబర్ 23 నుంచి డిసెంబర్ వరకు వాటిని పరిష్కరించి సప్లిమెంటు తయారు, ప్రింటింగ్ డెసెంబర్ 26 తదుపరి ఎలక్ట్రోరల్ రోల్స్, ఫైనల్ పబ్లికేషన్ 30-12-2016గా
జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మాట్లాడుతూ స్పెషల్ సమ్మరీ రివిజన్, 2017కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలక్ట్రోరల్ రోల్స్ ఇంటిన్సీవ్ రివిజన్ పూర్తయిందని వివరించారు. డ్రాప్ట్ రోల్ పబ్లికేషన్ పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, మునిసిపల్ కమిషనర్ వినయ్‌చంద్, సబ్‌కలెక్టర్లు తిరుపతి, మదనపల్లె హిమాంశుశుక్లా, కృతికాభాత్ర, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డిఆర్‌ఓలు, పలువురు రెవెన్యూ అధికారులు, చిత్తూరు ఆర్డీవో, జడ్పీ సిఇఓ పాల్గొన్నారు.