ఎవరూ లైఫ్ ఇవ్వరు... అవకాశం ఇస్తారంతే.. హీరో రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జీకి మారుపేరుగా నిలిచాడు రవితేజ. ఆయన సినిమాలు చాలా ఎనర్జిటిక్‌గా వుండి ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. అన్నిరకాల ఎమోషన్లను పండించగల సత్తా వున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ‘బెంగాల్ టైగర్’గా వస్తున్నాడు. సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బెంగాల్ టైగర్ ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా రవితేజతో ఇంటర్వ్యూ..
కాన్ఫిడెంట్‌గా ఉన్నాం
‘బెంగాల్ టైగర్’ సినిమాపై మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా కూడా బాగా జరగడంతో ఈ సినిమాపై గట్టి నమ్మకం ఏర్పడింది. దానికితోడు పాటలు కూడా మంచి హిట్ అవ్వడం ప్లస్ అయింది.
కొత్త కథ
‘బెంగాల్ టైగర్’ టైటిల్‌కు తగ్గట్టుగానే నా పాత్ర కూడా వుంటుంది. ఈ కథను దర్శకుడు సంపత్‌నంది చెప్పినపుడు చాలా కొత్తగా అన్పించింది. అన్ని రకాల కమర్షియల్ అంశాలున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమాకు టైటిల్ కూడా బాగా ప్లస్ అయింది.
ఎనర్జిటిక్‌గా ఉండే పాత్ర
ఇందులో నా పాత్ర గురించి చెప్పేకంటే మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇందులో అన్ని పనులు చేస్తాను. చాలా ఎనర్జిటిక్‌గా వుండే పాత్ర. కరెక్టుగా చెప్పాలంటే ఇద్దరు పర్‌ఫెక్ట్ వ్యక్తులమధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా.
హీరోయిన్లు ఇద్దరూ సూపర్
ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న తమన్నా, రాశీఖన్నా ఇద్దరూ అద్భుతంగా నటన కనపరిచారు. ఇప్పటికే తమన్నా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాంతోపాటు రాశీఖన్నా కూడా రాణిస్తోంది. తప్పకుండా తనకు మంచి భవిష్యత్తు వుంటుంది. నిజంగా ఇద్దరు హీరోయిన్లు తెలుగు నేర్చుకుని మరీ సినిమాలు చేయడం గొప్ప విషయం.
సంపత్‌నంది దర్శకత్వం
ఈ కథను చెప్పినపుడు సంపత్‌నంది చాలా ఎగ్జైట్ అయ్యాడు. దానికన్నా బాగా సినిమా తీశాడు. ప్రతి విషయం పట్ల మంచి అవగాహన వున్న వ్యక్తి.
మ్యూజిక్ హిట్
ఈ సినిమాకు భీమ్స్ చాలా మంచి పాటలని ఇచ్చాడు. ఇదివరకే తన పాటలు సూపర్‌హిట్లుగా నిలిచాయి. తనతో పనిచేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. ఈ సినిమాకు సంపత్ భీమ్స్‌తో సంగీతం చేయించడం, తను కూడా తన పనిని పర్‌ఫెక్ట్‌గా చేసి మంచి ఆడియోని ఇచ్చాడు.
నాకు నచ్చితేనే
ఈ సినిమాలో ఓ పాటలో ఇద్దరు హీరోయిన్లను ఎత్తుకొని ఆడే సీన్ వుంది. డాన్స్ మాస్టర్ ఆ మూమెంట్ చెప్పగానే వెంటనే చేశాను. అపుడు నాకు జ్వరం కూడా వుంది. ఏదేమైనా కెమెరా ముందుకు వచ్చిన తరువాత జ్వరం లాంటివి ఏవీ పట్టించుకోను. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.
రాజవౌళిని అభినందించాలి
‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ముఖ్యంగా చాలా భాషలకు డోర్లు తెరుచుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఒక డబ్బింగ్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడం గొప్ప విషయం. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజవౌళిని అభినందించాల్సిందే.
కొత్తవారికి అవకాశం
నా కెరీర్‌లో చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాను. ఖచ్చితంగా వాళ్ళల్లో విషయం వుంటే అది తప్పకుండా బైటికి వస్తుంది. నేను చేసిన దర్శకులు ఈరోజు పెద్ద దర్శకులుగా ఎదగడం ఆనందంగా వుంది.
లైఫ్ ఎవ్వరూ ఇవ్వరు
చాలామంది వాళ్ళకు లైఫ్ ఇచ్చారు అని అంటుంటారు. నిజంగా అది రాంగ్ పదం. ఇక్కడ ఎవరికి ఎవరు లైఫ్ ఇవ్వరు. కొత్తవాళ్లకు వారి టాలెంట్‌కు తగ్గట్టుగా అవకాశాలు మాత్రమే ఇస్తారు. అంతేకాని లైఫ్ ఇచ్చారనే పదాన్ని వాడొద్దు.
బాలీవుడ్ అవకాశాలు
నాకు ఇప్పటికే చాలా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. ఆమధ్య సినిమా కూడా చేయడానికి సిద్ధమయ్యాను. కానీ కుదరలేదు. తప్పకుండా ఇకముందు ఉండొచ్చు.
కిక్-2 విషయంలో
కిక్-2 సినిమా సమయంలో బాగా తగ్గాను అని అన్నారు. నిజానికి తగ్గిన మాట నిజమే. కానీ అది ఇపుడు సెట్ అయింది. అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అయితే ఆ సినిమా కథ నచ్చక ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
విభిన్నమైన పాత్రలు
నేను అన్ని రకాల సినిమాలు చేశాను. కానీ కమర్షియల్ సినిమానే నాకు ఇష్టం. అలాగని అన్నీ అవే సినిమాలు చేయను. తప్పకుండా విభిన్నమైన సినిమాలు కూడా చేస్తా. ఏ నటుడికైనా ఒకే మూసలో సినిమాలు చేయడం ఇష్టం వుండదు.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ‘ఎవడో ఒకడు’ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి. దాంతోపాటు చక్రి అనే దర్శకుడితో ఓ సినిమా వుంటుంది.

-శ్రీ