చిత్తూరు

నగదు రహిత లావాదేవీలపై అవగాహన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6 : నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలతో సమాజంలో అవినీతిని తగ్గించవచ్చని అన్నారు. ఇంటి వద్దే చరవాణిలో ఆర్థిక లావాదేవీలు జరిపి సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎస్వీయూ ఐదు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. ఎస్వీయూ అనుబంధ కళాశాలలు కూడా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ దేవరాజులునాయుడు, రెక్టార్ ఎం భాస్కర్, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రేమ కాదు..కామమే ప్రాణం తీసింది
* డిఎస్పీ మురళీకృష్ణ
తిరుపతి, డిసెంబర్ 6: తిరుచానూరు సమీపంలోని దామినేడు గృహాల్లో హత్యకు గురైన సురేష్‌ది ప్రేమ హత్య కాదని, స్నేహితుడి భార్యను కామించినందుకు స్నేహితుడే దారుణంగా హత్యచేశాడని అలిపిరి డిఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురేష్, అనిల్ స్నేహితులని తెలిపారు. అనిల్, సంధ్య అనే అమ్మాయిని ప్రేమించగా సురేష్ వారిద్దరికి వివాహం చేశాడని అన్నారు. అయితే సురేష్ సంధ్యనే కామించి తన కోరిక తీర్చమనడమే కాకుండా తనవెంట వచ్చేయాలని కోరాడన్నారు. అతని కోర్కెను నిరాకరించిన సంధ్య ఈ విషయం తన భర్తకు చెప్పింది. దీంతో వారు నెల్లూరులోని కోట ప్రాంతానికి వెళ్లిపోయారు. కొంతకాలం వీరి మధ్య మాటలు లేవు. అయితే కొద్ది రోజుల క్రితం తిరిగి కలుసుకున్న అనిల్‌తో సురేష్ తన మనసులోని మాటను వెల్లడించాడు. తాడిమేడులోని తన ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. అయితే ఈ సమయంలోను సురేష్, సంధ్యపై ఉన్న తన కోర్కెను అనిల్‌కు చెప్పాడు దీంతో అనిల్ కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేశారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
తిరుపతి, డిసెంబర్ 6: స్థానిక గొల్లపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ కళాశాల వెనుక ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే మృతురాలు ఎవరనే విషయం తెలియడం లేదు. హత్యా, లేక ఆత్మహత్య అనేది ఎమ్మార్‌పల్లి పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.