చిత్తూరు

టిటిడిలో పారదర్శకత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 4: టిటిడిలో గతంలోకన్నా నేడు పారదర్శతక పెరిగిందని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల సౌకర్యార్థం సిటీ కృష్ణతేజ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంటర్నెట్, వైఫే సౌకర్యాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వారికి టిటిడి అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి కూడా వ్యక్తం అవుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో టిటిడి సేవలు పారదర్శకంగా సాగుతున్నాయని, అయితే మీడియా భక్తుల అభిప్రాయాలను సేకరించి లోటుపాట్లు ఏవైనావుంటే టిటిడికి ఎత్తిచూపాలన్నారు. తనకున్న సినిమాహాళ్ళు, కేబుల్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నానని చెప్పారు. అందులో భాగంగానే జర్నలిస్టులకు మరింతగా ఉపయోగపడే ఉచిత వైఫై సేవలను నేడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు కష్టజీవులని, మేధావులైనా అనేక సమస్యలతో సతమతమవుతున్న విషయం తనకు బాగా తెలుసని చెప్పారు. మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందడుగు వేయాలని ఆయన జర్నలిస్టులకు హితవు పలికారు. దేశంలోనే ఆంధ్రరాష్ట్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ముందుందని ఈసందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి భవిష్యత్తులో మరింత ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించాల్సి ఉందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడి కృషితో పోలవరం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీరందుతుందని అన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఏపి ప్రభుత్వం అందిస్తున్న సేవలు మరే రాష్ట్రం ప్రజలకు అందించడంలేదని ఆయన చెప్పారు. సిటీ కృష్ణతేజ ఇడి హర్షవర్థన్ మాట్లాడుతూ 33 హెడి చానల్స్‌ను అందిస్తున్న ఏకైక నెట్‌వర్క్ సిటీ కృష్ణతేజ అన్నారు. ఈసందర్భంగా టిటిడి ఛైర్మన్‌ను తిరుపతి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, కార్యదర్శి గిరి, అలాగే సురేంద్రరెడ్డి, ప్రకాష్, చంద్రబాబు, నరేంద్ర శాలువకప్పి సన్మానించారు.