చిత్తూరు

కార్పొరేషన్ల రుణ లక్ష్యాలు వందశాతం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 11 : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్లకు నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ఎస్ ప్రద్యుమ్న ఎంపిడిఓలు, బ్యాంకు మేనేజర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన కార్యాలయం నుంచి ఆయా మండల ఎంపిడిఓలు, బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 12,661 మందికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా 4,767 మందికి మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారని వెల్లడించారు. అందులో 2,249 మంది దరఖాస్తులకు మాత్రమే సబ్సిడీ మంజూరుకు సిఫార్సు చేయడంపై ఎంపిడిఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం (నేడు) సాయంత్రం లోగా మొత్తం 12, 661 మంది దరఖాస్తులను బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సబ్సిడీని మంజూరు చేసి తన ఆమోదం కోసం పంపాలని ఆదేశించారు. నిర్దేశిత సంఖ్య కన్నా తక్కువగా చేసిన సంబంధిత ఎంపిడిఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసి ఎంపిడిఓలు, బ్యాంకు మేనేజర్లతో మాట్లాడాలని జెడ్పి సిఇఓ, ఎల్‌డిఎంలను, అన్ని కార్పొరేషన్ ఇడిలను ఆదేశించారు. మండల స్థాయిల్లోని బ్యాంకు మేనేజర్లు ఎంపిడిఓలకు సహకరించి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఇండియన్, ఆంధ్రాకులు 50 శాతం మేర రుణాలు మంజూరు చేశారని, మిగిలిన ఎస్‌బిఐ, సప్తగిరి గ్రామీణ, ఇండిన్ ఓవర్‌సీస్ బ్యాంకులు చాలా తక్కువ స్థాయిలో రుణాలు మంజూరు చేశాయని తెలిపారు. రుణాలు తక్కువగా మంజూరు చేసిన బ్యాంకుల వివరాలను వెంటనే తనకు అందజేయాలని ఎల్‌డిఎంను కలెక్టర్ ఆదేశించారు. 2016-17 సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ, కాపు కార్పొరేషన్లకు నిర్ధేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ లక్ష్యాలను సైతం అధిగమించాలన్నారు. తాజా నియమావళి, నిబంధనల మేరకు ఆయా ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రుణాలను ఆదే ఏడాదిలో మంజూరు చేసి తీరాలని స్పష్టం చేశారు. తక్కువ రుణాలు మంజూరు చేసిన మండలాలకు సంబంధించిన దరఖాస్తుదారుల వివరాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఓ పెంచలకిషోర్, ఎల్‌డి ఎం రామ్మోహన్‌రావు, మైనారిటీ, ఎస్సీ కార్పొరేషన్ల ఇడిలు శ్రీనివాసులు, శ్రీనివాసకుమార్, సాంఘిక సంక్షేమశాఖ జెడి విజయ్‌కుమార్, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, కాపు, బిసి కార్పొరేషన్ల ఇడిలు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుపతి, మే 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపుతోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాంయత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు మహాపూర్ణాహుతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఇ ఓ మునిరత్నంరెడ్డి, ఆలయ ఎ ఇ ఓ రాధాకృష్ణ, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.