చిత్తూరు

పరిశ్రమల ఏర్పాటుకు సిఎం విశేష కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 13: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమల ఏర్పాటుకు విశేషంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి ఎన్ అమరనాథ్‌రెడ్డి తెలిపారు. యాదమరి మండలం మోర్ధానపల్లె గ్రామంలోని అమరరాజా గ్రోత్ కారిడార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4.5 కెవి రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పరిశమ్రల స్థాపనకు చాలా అనువైన అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద క్రియో మోటార్స్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెప్పించారన్నారు. జిల్లాలో హీరోహోండా, అపోలోతోపాటు, ఐటి, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ఎక్స్‌ప్రెస్ 4 లైన్ హైవే వస్తుందని, చెన్నై-బెంగళూరు రాష్ట్రాల సరిహద్దులో కారిడార్‌లో జిల్లా ఉండటం తమ అదృష్టమన్నారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఎనర్జీ-సోలార్, విండ్ ఎనర్జీ తయారీకి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా నెడ్‌క్యాప్ ద్వారా 82 శాతం సబ్సిడి ధరపై సోలార్ పంపు సెట్లను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. అమరరాజ గ్రోత్ కారిడార్ చిత్తూరు జిల్లాకు ఒక వరమన్నారు. దక్షిణ ఇండియాలోనే అతిపెద్ద రూప్‌టాప్ పవర్‌ప్లాంట్‌ను అమరరాజ సంస్థ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరరాజ గ్రూప్ సంస్థలు కూడా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాలో 500 ఎకరాల్లో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన అమరరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ రామచంద్రనాయుడు అభినందనీయుడన్నారు. జిల్లాలో 62 పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు భూమి, విద్యుత్, నీరు లాంటి సదుపాయాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మందిని గుర్తించి, వారిలోని నైపుణ్యానికి తగ్గ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అంతకు ముందు సోలార్ ప్లాంట్ ముఖ ద్వారాన్ని ప్రారంభించి, మొక్కలను నాటారు. అనంతరం అమరరాజా గ్రూప్ కారిడార్‌కు తొలిసారిగా వచ్చిన మంత్రి అమరనాథ్‌రెడ్డితోపాటు, ఎంఎల్‌సి దొరబాబు, జిల్లా కలెక్టర్‌లను అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీల తరపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దుశ్సాలువాలతో ఘనంగా సన్మానించారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ జి శ్రీనివాసులు, చిత్తూరు మేయర్ కఠారి హేమలత, మాజీ ఎంపి దుర్గ, ఎస్పీడిసిఎల్ సిఎండి దొర, మాజీ మంత్రి లలితకుమారి, అమరరాజ కంపెనీ ఎండి రమాదేవి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నా రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేకే విమర్శలు
* చట్టపరంగా ఎలాంటి విచారణకైనా సిద్ధం
* టిడిపి నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్
తిరుపతి, మే 13: టిడిపి నగర అధ్యక్షుడిగా ఎదుగుతున్న తన అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బంగారు ఆభరణాల లావాదేవేల్లో తనకెలాంటి సంబంధం లేదని దంపూరి భాస్కర్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరం క్రితం బంగారు ఆభరణాల విషయంలో సుబ్రహ్మణ్యం, మల్లెల రఘపతి మధ్య తలెత్తిన వివాదంలో తనను పంచాయతీ నిర్వహించాలని కోరారన్నారు. అయితే అప్పటికే ఈవిషయం కోర్టులో ఉన్న కారణంగా తాను అందుకు నిరాకరించానని తెలిపారు. అయితే సుబ్రహ్మణ్యం తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. దీనిని అలుసుగా తీసుకుని వైకాపా నాయకులు తనపై బురదజల్లడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని వారి వద్ద ఆధారాలుంటే ఫిర్యాదు చేసినవారికి వైకాపా నాయకులు సహకరించాలని కోరారు. అలాగే తాను అక్రమాలకు పాల్పడివుంటే చట్టపరంగా తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని చేయాలని ఆయన వైకాపా నాయకులకు హితవుపలికారు. టిడిపి నాయకులు నీలం బాలాజీ, సూరా సుధాకర్ రెడ్డి, మనె్నం శ్రీనివాసులు, కృష్ణయాదవ్ మాట్లాడుతూ బంగారు ఆభరణాల లావాదేవీలో టిడిపి నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌కు ఎలాంటి సంబంధం లేదని తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామన్నారు. ఈవ్యవహారం కోర్టులో ఉన్న కారణంగానే ఆయన ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోలేదన్నారు. దంపూరిపై ఆరోపణలు చేస్తే అది టిడిపిపై చేసినట్లవుతుందని భావించే టిడిపి ప్రతిష్టతను దెబ్బతీయడానికి వైకాపా నాయకులు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. టిడిపి కార్యకర్త నుంచి సి ఎం వరకు పార్టీలో అందరూ క్రమశిక్షణ కలిగినవారని తెలిపారు. విమర్శలు చేస్తున్నవారు తమ వద్ద ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈవిలేఖరుల సమావేశంలో ఆపార్టీ నాయకులు శాంతమ్మ, పద్మ, జైకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దంపూరి భాస్కర్ అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
* వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర
తిరుపతి, మే 13: టిడిపి నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ ఓ మహిళను మోసం చేసి నాలుగున్నర కిలోల బంగారం అమ్మేసిన వ్యవహారంలో సిఐడి విచారణ ఎదుర్కొంటున్న ఆయనపై నిశ్పక్షపాతంగా విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమాలకు, దౌర్జన్యాలకు, భకబ్జాలకు పాల్పడుతున్నవారికి టిడిపిలో ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బంగారం అమ్మిన వ్యవహారంలో టిడిపి నగర అధ్యక్షుడితోపాటు మిగిలిన నాయకులకు సైతం ఉన్న సంబంధాలను బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వెంటనే అరెస్టు చేయాలన్నారు. వైకాపా జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆపార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. చివరికి ప్రజా సమస్యల పరిష్కారానికి, సి ఎం అవినీతిపై ప్రధానిని కలిసి వివరించినా దానిపై కూడా టిడిపి నేతలు విమర్శలు చేయడం వారికే చెల్లిందన్నారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు తమ తీరు మార్చుకోవాలన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో ఆపార్టీనాయకులు క్రిష్ణవేణమ్మ, ఐసి ఎస్ రెడ్డి, రఫి, లక్ష్మీరెడ్డి, పునీత, కృపావతి, ప్రమీల, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరుపతి, మే 13: శ్రీ వేంకటేశ్వరునికి చెల్లెలుగా, తిరుపతి గ్రామ దేవతగా పూజలందుకుంటున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. గత మూడు రోజులుగా అమ్మవారికి వరుసగా బైరాగి వేషం, బండవేషం, తోటి వేషం వేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే శనివారం మాత్రం దొరవేషాన్ని కైకాల, చాకలి కులస్థులు మాత్రమే వేస్తారు. కైకాల కులస్థుడు దొరవేషాన్ని వేస్తే, చాకలి కులస్థుడు మంత్రి వేషాన్ని వేస్తాడు. వీరు నగరంలో తిరుగుతూ ప్రజలచేత పూజలు అందుకుంటారు. గంగమ్మకు గత మూడు రోజులుగా వేషాలు వేయని వారు సైతం ఈ ఒక్కరోజు వివిధ వేషధారణల్లో అమ్మవారి ఆలయానికి చేరుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఆలయం ముందు మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు, నూనె దీపాలు, నెయ్యి దీపాలు, పిండి దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
సోదరి గంగమ్మకు శ్రీవారి సారె
* శోభయాత్రగా తీసుకువచ్చిన టిటిడి ఇ ఓ సింఘాల్
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తాతయ్యగుంట గంగమ్మను స్వయాన చెల్లెలుగా బావిస్తారు. అందుకే అమ్మవారి జాతరలో ప్రతి ఏడాది శ్రీవారు తన సోదరి అయిన గంగమ్మకు సారెను పంపించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే శనివారం టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, జె ఇ ఓ పోలభాస్కర్ తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను ఆలయం వద్ద గంగమ్మ గుడి దేవస్థానం చైర్మన్ ఆర్సీ మునికృష్ణకు అందజేశారు. ఆర్సీ మునికృష్ణ తలకు పాగా చుట్టుకుని వెండిపల్లెంలో స్వామివారు పంపిన సారెను తలపై పెట్టుకుని ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ పోలాభాస్కర్ వెంటరాగా మంగళవాయిద్యాల మధ్య శోభయాత్రగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్సీ మునికృష్ణ సారెను అర్చకులకు అందించారు. ఈసందర్భంగా టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ విలేఖరులతో మాట్లాడుతూ గంగమ్మ తల్లి సాక్షాత్తు వేంకటేశ్వరుని చెల్లెలని పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారన్నారు. ప్రతి ఏటా చైత్రమాసంలో జరిగే జాతర సందర్భంగా నాల్గవరోజు అమ్మవారికి టిటిడి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, వారి జీవన విధానాలు ప్రతి బింబించే విధంగా అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే భక్తులు బైరాగి, బండ, తోటి వేషాలు వేస్తారన్నారు. అనంతరం ఇ ఓ, జె ఇ ఓలు అమ్మవారిని దర్శించుకున్నారు.అంతకమునుపు ఇ ఓ, జె ఇ ఓలు గోవిందరాజ స్వామిని దర్శించుకోగా వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, స్థానిక ఆలయాల డిప్యూటి ఇ ఓ వరలక్ష్మి, ఏ ఇ ఓ ప్రసాదమూర్తిరాజు, తిరుమల శ్రీవారి ఆలయ బొక్కసం బాధ్యులు గురురాజారావు, గంగమ్మ ఆలయ ఇ ఓ సుబ్రమణ్యంతోపాటుగా ఆలయ పాలక మండలి సభ్యులు ఎ.సూర్యనారాయణ రెడ్డి, అక్కిపల్లి మునిక్రిష్ణయ్య యాదవ్, కెవిఎస్ రుషికేష్, చెంబకూరు రాజయ్య, గెంజి సుధాకర్ రెడ్డి, పి.మంగమ్మ, ఈవూరి దేవరాజ్ ఆచారి, డాక్టర్ శ్రీరామ, జి ఎస్ మురళి తదితరులు పాల్గొన్నారు.

టెంపో బోల్తా - ఒకరి మృతి
*నలుగురు పరిస్థితి విషమం - 15గొర్రెలు దుర్మరణం
మదనపల్లె, మే 13: బతుకు జీవనంపై తమిళనాడుకు చెందిన వ్యాపారులు ఆంధ్రలోని చిత్తూరుజిల్లా అంగళ్ళు గొర్రెల సంతకు వచ్చి జీవాలను కొనుగోలుచేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వెళ్తున్న తప్పించబోయిన గొర్రెలటెంపో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యాపారి మృతిచెందగా, మరో నలుగురు వ్యాపారులకు తీవ్రరక్తగాయాలైయ్యాయి. ఈ సంఘటన శనివారం మదనపల్లె శివారుప్రాంతం బైపాస్‌రోడ్డులో చోటుచేసుకుంది. మదనపల్లె టూటౌన్ ఎస్‌ఐ గంగిరెడ్డి కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన సలీంబాష(49), నూరుద్ధీన్(37), ఫజులుల్లా(35), కలందర్(45), మహ్మద్‌ఆలీ(65)లు గొర్రెల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు. శనివారం చిత్తూరుజిల్లా అంగళ్ళు గొర్రెల సంతకు తన బంధువులకు చెందిన టెంపోను బాడుగకు తీసుకుని వచ్చారు. ఐదుగురు కలసి 50 గొర్రెలు కొనుగోలుచేసి తిరుగుప్రయాణంలో వేలూరుకు బయలుదేరారు. మదనపల్లె పట్టణ శివారుప్రాంతం చంద్రకాలనీ సమీపంలోని బైపాస్‌రోడ్డులో ముందు వెళ్తున్న గ్యాస్‌ట్యాంకర్‌ను ఓవటేక్ చేయబోతూ గొర్రెల టెంపో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న సలీంబాష(47) అక్కడికక్కడే మృతిచెందగా, నూరుద్ధీన్, ఫజులుల్లా, కలంధర్, మహ్మద్ ఆలీలు తీవ్రరక్తగాయాలకు గురైయ్యారు. టెంపోలోని 15గొర్రెలు సైతం అక్కడికక్కడే మృతిచెందాయి. మరో పాతికగొర్రెలకు కాళ్ళు విరిగిపోయాయి. గాయపడిన క్షతగాత్రులను 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ గంగిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
‘సేవా కల్పవృక్షం’ శ్రీవారి సేవకుల వ్యవస్థ
* శ్రీవారి సేవ 17 ఏళ్లలో తరించిన 8.15 లక్షల మంది సేవకులు

తిరుపతి, మే 13: శ్రీవారి భక్తుల కోర్కెలు తీర్చే వాహనంగా కల్పవృక్షం నిలిచిన విషయం పాఠకులకు తెలసిందే. అదే తరహాలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులకు సేవలందించడంలో 2000 సంవత్సరంలో టిటిడి ఏర్పాటుచేసిన శ్రీవారిసేవకుల వ్యవస్థ భక్తుల పాలిట సేవా కల్పవృక్షంగా నిలుస్తోంది. గత 17 ఏళ్ల ప్రస్థానంలో 8.15 లక్షల మంది సేవకులు శ్రీవారి భక్తులకు సేవలందించడం ఇందుకు నిదర్శనం. గమనించదగ్గ విషయం ఏమిటంటే క్యూలైన్లను క్రమబద్దీకరించే దగ్గర నుంచి దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవలందించడంలోనూ, తాగునీరు, సరఫరా నుంచి అన్నప్రసాద వితరణ వరకు లడ్డూ వితరణ దగ్గర నుంచి లగేజి స్కానింగ్ వరకు తిరునామం పెట్టేదగ్గర నుంచి తలంబ్రాలు సమర్పించే కల్యాణ కట్టలో సేవలందించడం వరకు ఈ శ్రీవారి సేవకులు మనసావాచా సేవలందిస్తూ తరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ శ్రీవారి సేవా వ్యవస్థ టిటిడి పాలనాపరమైన అంశాల్లో కీలకపాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనేచెప్పాలి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సేవలందించడంలో ఓ వైపుటిటిడి ఉద్యోగులు 13 వేల వరకు ఉంటే గత 17 ఏళ్లుగా 8.15 లక్షల మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు. వీరిలో ఆంధ్ర,కర్ణాటక, తమిళనాడు,తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, కేరళ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పుదిచ్చేరి, న్యూఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే భక్తుల సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల్లో సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు ఉన్నారు. ఐ ఎ ఎస్, ఐపి ఎస్ లాంటి అత్యున్నత విద్యావంతులు కూడా భక్తులకు సేవలు చేస్తున్నారు. కాగా గత 17 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 5 లక్షల మంది సేవకులు, తమిళనాడు నుంచి 1.6 లక్షలు, తెలంగాణ నుంచి 58వేలు, మహారాష్ట్ర నుంచి 37 వేలు, కర్నాటక నుంచి 32 వేల మంది సేవకులు పాల్గొనడం విశేషం. ఒక చత్తీష్‌గఢ్, ఒరిస్సా, కేరళ, జార్కండ్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చినవారు మరో 20 వేలు కావడం విశేషం. కాగా శ్రీవారి సేవకులు సాధారణ సేవలను అందించడంతోపాటు టిటిడి 5 ఏళ్లక్రితం ప్రారంభించిన పరకామణి, లడ్డూప్రసాద వితరణ అనే ప్రత్యేక సేవల్లో కూడావారి పాత్ర ఉంది. ఇందులో స్వామివారి హుండీలో భక్తులు సమర్పించే ధనరూప కానుకలను లెక్కించే పరకామణి సేవను టిటిడి 2012 ఆగస్టు 20న ప్రారంభించింది. అప్పటి నుంచి 10 మే 2017 వరకు 59 వేల మందికిపైగా పరకామణి సేవకులు దక్షిణాది రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఇక 2013 జనవరి 13న ప్రారంభమైన లడ్డూ ప్రసాద సేవలో10మే 2017 వరకు సుమారు 22 వేల మంది సేవకులు పాల్గొని భక్తులకు సంతృప్తికరమైన సేవలందిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని లడ్డూ ప్రసాద సముదాయంలో వినియోగంలో ఉన్న 49 కౌంటర్లలో 14 కౌంటర్లు లడ్డూ ప్రసాద సేవకుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇవి కాక మరో 6 కౌంటర్లలో కవర్ల విక్రయాన్ని కూడా శ్రీవారి సేవకులే నిర్వహిస్తుండటం విశేషం. మరింత మంది భక్తులు భాగవత సేవకులుగా అవకాశం ఇచ్చేందుకు వీలుగా టిటిడి ఈ ఏడాది మే నుంచి 1000 మందికి అన్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ నూతన విధానానికి దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.
శ్రీ సత్యసాయి సేవాసంస్థ ప్రతినిధులతో శిక్షణ
శ్రీవారి సేవకులకు శిక్షణను అందించి వారి నుంచి మరింత మెరుగైన సేవలను భక్తులకు అందించాలన్న సదాలోచనతో టిటిడి గత ఏడాది మే 2నుంచి శ్రీ సత్యసాయి సేవాసంస్థ శిక్షకులతో ప్రతిరోజూ ఉదయం, రాత్రి సత్సంగం, భజన వంటి కార్యక్రమాలతో శిక్షణనిస్తుంది.