చిత్తూరు

వైద్యుల నిర్లక్ష్యంతో పురిటిబిడ్డ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 21 : జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పురిటి బిడ్డ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వైద్యుల తీరును నిరసిస్తూ బాధితులు, స్థానికులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ప్రధాన గేటును మూసివేసి వైద్యుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెనుమూరు మండలం బి అగ్రహారానికి చెందిన భానుప్రియ అనే గర్భిణి ఈ నెల 19న కాన్పు కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే వైద్య సిబ్బంది కాన్పుకు ఇంకా రెండు రోజులు సమయం ఉందని అంత వరకు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో ఈ విషయాన్ని ఆమె బంధువులు వైద్యులకు తెలియచేశారు. అయితే సకాలంలో వైద్యులు స్పందించకపోవడంతో పాటు జూనియర్ నర్స్‌ను పంపించారు. ఈ తరుణంలో ఇంకా కాన్పుకు సమయం ఉందని అంత వరకు వేచి ఉండాలని చెప్పి నర్స్ ఉడాయించింది. కొంత సేపటికి భానుప్రియ ప్రసవించగా కొంత సేపటికే బిడ్డ చనిపోయింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న భానుప్రియకు సిబ్బంది వైద్య సేవలు చేయకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కనీసం సౌకర్యాలు కల్పించకపోవడంతో బిడ్డ మృత్యువాత పడిందని బంధువులు తెలిపారు. వివాహమై ఆరు సంవత్సరాలైనా బిడ్డలు లేకపోవడంతో ఇటీవల గర్భం దాల్చిన భానుప్రియ తన బిడ్డను కాపాడుకోవడానికి ముందస్తుగానే ఆసుపత్రిలోని వైద్యుల సలహాలను తీసుకుంటూ వచ్చిందని తెలిపారు. అయితే కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బిడ్డ పురిటితోనే చనిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తల్లీ బిడ్డను కాపాడాలని పలుమార్లు వైద్య సిబ్బందిని ప్రాధేయపడినా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారని వాపోయారు. దీంతో వారి తీరును నిరసిస్తూ బాధితులతో పాటు స్థానికులు గురువారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ప్రధాన గేటు మూసివేసి వైద్యులు తీరుపై విరుచుకుపడ్డారు. న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న టూటౌన్ సిఐ వెంకటప్ప వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం శూన్యమైంది. దీంతో పోలీసులు, బాధితులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ జయరాజ్‌తో పోలీసులు చర్చించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.