చిత్తూరు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, మే 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని తిరుపతి ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2000 కి.మీ చేరుకున్న సందర్భంగా ఆయనకు సంఘీభావంగా మండలంలోని కడూరు క్రాస్ వద్ద నుంచి వరదయ్యపాళెం వరకు తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా సాధనకై ఎంపీ పదవికి రాజీనామా చేసి మండలానికి విచ్చేసిన ఎంపీకి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వరదయ్యపాళెం వరకు పాదయాత్ర అనంతరం బస్టాండ్ ఆవరణంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రత్యేక హోదాను తుంగలోతొక్కిన అసమర్థనాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలందరూ రాజీనామా చేశామని, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎంపీ వరప్రసాద్‌ను వైకాపా కార్యకర్తలు, నాయకులు సన్మానించారు. ఈకార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ నాయుడు దయాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటకృష్ణయ్య, ఉజ్వల్‌రెడ్డి, బందిలి సురేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.