క్రైమ్/లీగల్

ఆటోబోల్తా.. ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణగిరి, మే 28: వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వెల్దుర్తి నుంచి తొగట్చేడుకు వెళ్తున్న ఆటో సోమవారం రాత్రి వెల్దుర్తి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న కృష్ణగిరి మండలం తొగట్చేడు గ్రామానికి చెందిన అయ్యన్న(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలోని మరో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెల్దుర్తి ఎస్‌ఐ ఖాజావలీ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ముగ్గురికి గాయాలు
కృష్ణగిరి, మే 28: వెల్దుర్తి మండలం మల్లేపల్లె హంద్రీనీవా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సోమవారం విద్యుదాఘాతంతో ముగ్గురు ఎలక్ట్రీషియన్లు తీవ్రంగా గాయపడ్డారు. సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. అయితే పక్కనే ఉన్న మరో యూనిట్ నుంచి విద్యుత్ సరఫరా కావడంతో అక్కడే పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు వెంకటేశ్, నవీన్, కృష్ణకు షాక్ తగిలింది. వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమితం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు, విద్యుత్‌శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి
బేతంచెర్ల, మే 28:మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కౌలురైతు ఈడిగ చిన్నమద్దిలేటి స్వామి(30) ఈ నెల 25వ తేదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించాగ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. చిన్నమద్దిలేటి గ్రామంలో 20 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తుండేవాడు. అయితే వర్షభావ పరిస్థితులు, పండిన పంటకు గిట్టు ధర లేక, తదితర కారణాలతో సాగు కోసం దాదాపు రూ. 10 లక్షలు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 25వ తేదీ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన బంధువులు చికిత్స కోసం కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అతడికి భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు.