చిత్తూరు

కుమారుడు, మనవడి మరణం జీర్ణించుకోలేక ఇంటి పెద్ద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, జూలై 17: విధి వక్రీకరించింది... దేవుడు చిన్న చూపు చూశాడు. వారం వ్యవధిలో ఆ కుటుంబం స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి. కురబలకోట మండలంలో జరిగిన ఈ దారుణ సంఘటనతో విచ్ఛిన్నమైన ఆ కుటుంబాన్ని చూసి గ్రామస్థులు తీవ్రంగా కలత చెందుతున్నారు. గత మంగళవారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడ్డారెడ్డిగారిపల్లెకు చెందిన వి.వెంకటరమణ (75) కుమారుడు వి.చంద్రశేఖర్ (42), మనవడు వి.దేవేంద్ర (12)లతో పాటుగా మరో కొడుకు కుమారుడు దినేష్ మృత్యువాత పడ్డారు. కొడుకు, మనవళ్లను మృత్యువు కబళించడాన్ని జీర్ణించుకోలేని వెంకటరమణ గత వారం రోజులుగా మంచినీళ్లు కూడా ముట్టకుండా తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో గుండె పోటుతో ఆయన మృతి చెందాడు. అసలే జీవితాంతం వెంట ఉంటాడనుకున్న భర్త, ఎంతో గొప్ప చదువులు చదువుకుని ఆదుకుంటాడనుకున్న కొడుకును మృత్యువు కబళించడాన్ని భార్య అక్కాయమ్మ జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనతో కాలం వెల్ల బుచ్చుతోంది. ఆ సంఘటన మరచిపోవడానికి కూడా సాధ్యం కాని నేపథ్యంలో తనకు ఒక తండ్రిలా వెంట ఉంటాడనుకున్న మామ కూడా మృతి చెందడంతో ఆమె మరింత మనోవేదనకు గురవుతోంది. వారం వ్యవధిలో తన కుటుంబం చిన్నాభిన్నం కావడంతో ఉన్న ఒక్క కూతురు రెడ్డిరాణి (14)ని ఎలా పోషించుకోవాలో, మగ దిక్కులేని తన జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో అర్థంకాక మామ మృతదేహం పక్కన కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఆమెను ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.