చిత్తూరు

భారీగా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 30: శ్రీ కాళహస్తి టూటౌన్ పోలీసులు శనివారం స్వర్ణముఖి నది వడ్డున రూ.4 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నలుగురు దొంగలను అరెస్ట్‌చేశారు. ఈ సంఘటనపై డి ఎస్పీ వెంకటకిశోర్ విలేఖరులతో మాట్లాడుతూ బైపాస్ వంతెన వద్ద శువ్రకారం రాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో టౌట్ సి ఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్‌చేసినట్లు తెలిపారున నదివడ్డున ఉన్న చెత్తకుప్పలతో 4 ఎర్రచందనం దుంగలు దొరికాయని తెలిపారు. అరెస్టయిన వారిలో కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన డి.బాబు, తిరుపతికి చెందిన ఎన్.బాబు, మల్లికార్జున్ , కొటాలకు చెందిన వెంకటరామయ్యలను అరెస్ట్‌చేశామన్నారు. చెన్నైలోని కె ఆర్ బాబు అనే స్మగర్లర్‌కు ఈ నలుగురూ సహకరిస్తుంటారని, వీరంతా పాత నేరస్తులే అని తెలిపారు.
షి టీమ్ ప్రారంభం
శ్రీ కాళహస్తి పట్టణంలో మహిళలు వేధింపులకు గురికాకుండా షీ టీంను ఏర్పాటుచేసినట్లు డి ఎస్పీ వెంకటకిశోర్ తెలిపారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌లపై ఫిర్యాదులుంటే 8106593539 అనే నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. శారద అనే కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఈ టీమ్ పనిచేస్తుందని , ఈ బృందంలో నలుగురు సిబ్బంది పనిచేస్తారన్నారు.
పాకాలలో..
పాకాల: తిరుపతి-చిత్తూరు జాతీయ రహదారిలోని పాకాల మండలం గాదంకి అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను,వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ బి ఆర్వో తిరుమలరావు తెలిపారు. శనివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో తనిఖీల్లో బాగంగా బీట్ ఆఫీసర్లు బాషా, జ్యోతి తమ సిబ్బందితో తనిఖీ చేస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెడుతున్న బొలొరా వాహనాన్ని రోడ్డువైపు వదిలి వెళ్ళిపోయారు. దీనిని గుర్తించిన అటవీశాఖ అధికారులు అందులో ఒక టన్ను 78కేజీల బరువున్న 37 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.