చిత్తూరు

అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 30: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 600గ్రాముల బంగారు నగలు, నాలుగు మోటార్ సైకిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ జి.శ్రీనివాస్ తెలిపారు. ఎస్పీ కథనం మేరకు అనంతపురం జిల్లా వేలంమంది గ్రామానికి చెందిన మంగళ శీన(34), కడప జిల్లా మర్యపురంకు చెందిన ఎఆర్ కానిస్టేబుల్ మోల్ల జోహన్నస్(50), అనంతపురం జిల్లా అయ్యవారిపల్లెకు చెందిన గోరవ ఎర్రిస్వామి(24)లతోపాటు మరో ఇద్దరు మైనర్ బాలురు ఆంధ్ర, కర్నాటక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మహిళల మెడలో నుంచి మంగల సూత్రాలను చోరీ చేయడంలో ఆరితేరిన ముఠాఅని ఎస్పీ తెలిపారు. మదనపల్లె డి ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు శుక్రవారం మదనపల్లె శివారు ప్రాంతంలో ఈ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ప్రధానంగా మంగళ శీను 2002నుండి రాయల సీమ జిల్లాలతో పాటు బెంగుళూరు నగరంలో చైన్ స్నాచింగ్ చేయడమే దినచర్య అని, ఇతనిపై ఆంధ్ర, కర్నాటకాలో సుమారు వందకు పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో ఇతనిపై ఎన్నో అరెస్ట్ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. గత ఏడాది కడప జైలు నుంచి విడుదల అయిన మంగళ శీను తిరిగి ఈ దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. ఇందులో కడప జిల్లా ఎ ఆర్ కానిస్టేబుల్‌గా ఉన్న జోహన్సస్ పలుమార్లు సస్పెండ్‌కు గురికావడంతో ఇతను కూడా మంగళ శీనుతో పాటు గొరవ ఎర్రిస్వామితో కలసి ఓ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ఈ ముఠా ఇద్దరు మైనర్ బాలురతో కలసి మహిళలు ఒంటరిగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాపుకాసి ముందుగానే పథకం ప్రకారం ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు చైనును లాక్కెళ్లి సొమ్ము చేసుకునేవారన్నారు. వీరంతా కలసి తొమ్మిది నెలల కాలంలోనే 29చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు వివరించారు. వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 600గ్రాముల గల బంగారు చైను, 4మోటార్ సైకిళ్లు, ఒక కారును రికవరీ చేయడం జరిగిందన్నారు. దీని విలువ సుమారు 23లక్షలు ఉన్నట్లు చెప్పారు. ఎ ఆర్ కానిస్టేబుల్ అయిన జోహన్సన్‌పై పలు కేసులు ఉన్నాయని ఇప్పటికి మూడు పర్యాయాలు సస్పెండ్ అయ్యారన్నారు. ఈ ముఠా చిత్తూరులో 14, కడపలో 5, కర్నూలు 3, తిరుపతిలో2 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారు. వీరి ముగ్గురిని అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించామని మరో ఇద్దరు బాలురు మైనర్లు కావడంతో వారిని బాలసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులకు ఎస్పీ రివార్డులు అందచేసారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎఎస్పీ అభిషేక్ మొహంతి, మదనపల్లె డిఎస్పీ రాజేంద్రప్రసాద్, క్రైం డి ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు.