క్రైమ్/లీగల్

సిద్దేశ్వర కోన నీటిలో పడి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవీబీపురం, ఆగస్టు 24: మండలంలోని సిద్దేశ్వరకోన వాటర్‌పాల్స్‌లో బెంగళూరుకు చెందిన ఆర్.సూర్య (20) అనే విద్యార్థిని పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. సూర్య బెంగళూరులోని న్యూ హరిజన ఇంజినీరింగ్ కళాశాలలోకంప్యూటర్ సైన్స్ 3వ సంవత్సరం చదువుతోంది. తన స్నేహితులు ఆరుగురితో కలిసి సిద్దేశ్వర కోనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం బెంగళూరు నుంచి బయలుదేరి పుత్తూరుకు చేరుకున్నారు. అక్కడ ఒక ప్రైవేటు లాడ్జీలో గది అద్దెకు తీసుకుని ఆ రాత్రి బసచేశారు. గురువారం సిద్దేశ్వర కోనకు బయలుదేరారు. ఈ బృందంలో కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, సూర్య, ఆమె స్నేహితురాలు ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించి వాటర్‌పాల్స్‌లో స్నానానికి దిగారు. సూర్యకు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఆమెను రక్షించడానికి స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ స్నేహతురాలు మృతిచెందిన విషయాన్ని సూర్య స్నేహితులందరూ సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సూర్య మృతదేహాన్ని వెలికితీశారు. ఇదిలా ఉండగా వాస్తవానికి సూర్య తండ్రి రాజన్, తల్లి సుబాత తమిళనాడు వాసులు. తండ్రి రాజన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో ఫిలిఫ్పైన్స్ దేశంలో వ్యాపారలావాదేవీలు నడుపుతున్నారు. తల్లి తమిళనాడులోనే ఉంటోంది. కుమార్తె సూర్యను బెంగళూరులో ఇంజనీరింగ్ కళాశాలలో చేర్చారు. ఇదిలా ఉండగా సూర్య మరణించిన విషయాన్ని కేవీబీపురం ఎస్‌ఐ నరేష్, ఫిలిఫ్పైన్స్‌లో ఉన్న ఆమె తండ్రికి, తమిళనాడులో ఉన్న తల్లికి సమాచారం అందించారు. తల్లి, ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం కేవీబీపురం చేరుకున్నారు. తండ్రి రాజన్ ఫిలిఫ్పైన్స్ నుంచి బయలుదేరి వస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సూర్యతో పాటు ఉన్న ఆమె స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం సేవించినందుకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డితో మృతురాలు సూర్య తండ్రికి పరిచయం ఉండటంతో వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
భద్రత లేదు - పర్యాటకుల ప్రాణాలకు భరోసా లేదు
సిద్దేశ్వర కోనకు వెళుతున్న పర్యాటకులకు తగిన భద్రత కల్పించడంలో అధికారులు విఫలమవుతున్న నేపథ్యంలో పర్యాటకుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోందని పలువురు విమర్శిస్తున్నారు. గత 5 సంవత్సరాల వ్యవధిలో 20 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సిద్దేశ్వర కోన వద్ద పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచికబోర్డులు లేకపోవడం అటవీశాఖాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే చెప్పాలి. ప్రధాన రహదారికి సిద్దేశ్వర కోనకు సుమారు 10 కి.మీ దూరం ఉంది. ఈ 10 కి.మీ పూర్తిగా అడవిమార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికుల భద్రతకు సంబంధించిగానీ, తగిన సూచనలు తెలియజేసే చర్యలకు గానీ అటవీశాఖాధికారులు దృష్టిసారించకపోవడంతోనే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.