చిత్తూరు

పుష్పగిరి మఠం అవకతవకలపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 30: తిరుమల్లో సంచలనాలకు దారి తీసిన పుష్పగిరి మఠం అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని తిరుమల డిఎస్పీ మునిరామయ్య తెలిపారు. ఆయన శనివారం తమ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్పగిరిమఠానికి సంబంధించిన నిర్వహణ, అవకతవకలపై మఠం యాజమాన్యం చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ మేరకు గతంలో మఠాన్ని నిర్వహించిన వ్యక్తులు వారి ఆనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ వ్యవహారానికి సంబందించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విలువైన సమాచారాన్ని రాబట్టామన్నారు. అంతే కాకుండా మఠానికి సంబందించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నామని వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. పోలీసు విభాగంతోపాటు రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు కూడా మఠంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ ప్రారంభించారన్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.