చిత్తూరు

మే 6 నుంచి నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో సమ్మర్ క్రికెట్ క్యాంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 30: స్థానిక నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో మే 6 నుంచి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ స్థాయి కోచ్ బి. విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు మే 5వ తేదీ లోపల పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. క్యాంపుకు వచ్చే క్రీడాకారులు వైట్ అండ్ వైట్ డ్రెస్ తీసుకురావాలని, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తికలిగిన క్రీడాకారులు ఎండి జిలానీ క్రికెట్ కోచ్‌ను సంప్రదించాలన్నారు. అప్లికేషన్లు మునిసిపల్ హైస్కూల్ క్రికెట్ నెట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.