చిత్తూరు

తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 12: తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నాలక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం మదనపల్లెలో బీజేపీ జాతీయనేత చల్లపల్లె స్వగృహంలో విలేఖర్ల సమావేశం మాట్లాడుతూ డ్రామాకంపెనీ టీడీపీ తన పరువు కాపాడుకునేందుకు కాంగ్రెస్‌పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని వాటేసుకుందన్నారు. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరుతుండటంతోనే నేడు ఎసీబీ, ఐటీ దాడులు జరుగుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీపై నిందలు వేయడం సబబుకాదన్నారు. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ పన్నులు ఎగవేయవచ్చునన్న సిద్ధాంతం సీఎం ఒప్పకున్నట్లైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అదే రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని భూకబ్జాలు, ఇసుక, మట్టిమాఫియా చేయవచ్చునని, మైనింగ్ అమ్ముకోవచ్చునని, లిక్కర్ వ్యాపారం చేయవచ్చునని సీఎం ఒప్పకుంటే బీజెపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సీఎం చంద్రబాబు దొంగల్ని చంకలలో పెట్టుకుని కాపాడుతానని ముందుకొస్తే ప్రజాస్వామం ఏమైపోవాలని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో దొంగలను ప్రోత్సహించిన సీఎంలలో చంద్రబాబునే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ జాతీయనేత చల్లపల్లె నరసింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సుంకర శ్రీనివాసులు, కోలా ఆనంద్, రాష్టన్రేతలు డాక్టర్ అజంతుల్లాఖాన్, జెట్టికృష్ణయ్యవర్మ, పరీధ్‌ఖాన్, పట్టణ అధ్యక్షులు బర్నేపల్లె రవికుమార్, నాయకులు పూలనాగరాజు, భగవాన్, బాలసుబ్రమణ్యంయాదవ్ తదితరులు ఉన్నారు.