చిత్తూరు

బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 12: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు, పెరటాశి మాసం నేపథ్యంలో భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాటు చేపట్టాలని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమలలో ఆయన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ అధికమవుతోందన్నారు. అందుకు తగ్గట్లుగా భక్తులకు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం తదితర సౌకర్యాలను ప్రణాళికాబద్దంగా ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు వసతి కేటాయింపులో అధికారులు మరింత పారదర్శకత పాటించాలన్నారు. ముందు వచ్చిన వారికి ముందు వసతి అనే నియమావళి ప్రకారం గదులు కేటాయించాలన్నారు. విజిలెన్స్ అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, వసతి, అన్నప్రసాదాల పంపిణీ, రద్దీ నిర్వహణ, వాహన సేవలను పరిశీలించాలని సమావేశానికి వచ్చిన శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు ధ్యానచంద్, ప్రవీణ్ ఆదిత్య, విశ్వనాథన్, గోపాలకృష్ణ, దినేష్‌కుమార్‌లను ఆయన కోరారు. 14వ తేదీ గరుడసేవ రోజున భక్తులకు అవసరమైన సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. శ్రీవారి భక్తులకు అంకిత భావంతో విదులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగులను జేఈఓ అభినందించారు. ఈ సమావేశంలో టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఎస్‌ఈలు శ్రీరాచంద్రా రెడ్డి, సుధాకర్ బాబు, వేంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, వీజీఓలు రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ఠ తదితరులు పాల్గొన్నారు.