చిత్తూరు

శ్రీవారి గరుడ సేవకు 514 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 12: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురకుండా అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేశామని, ప్రధానంగా గరుడ సేవ రోజున ప్రతి ఒక్క నిమిషానికి రెండు బస్సులు చొప్పున 514 బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.చెంగల్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, తిరుమల మధ్య 411 బస్సులతో ప్రతిరోజూ 1669 ట్రిప్పులను నడుపుతన్నట్లు చెప్పారు. లక్ష మంది భక్తులను క్షేమంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా భారత్-4 ఇంజిన్లు కల 147 కొత్త అశోక్ లైలాండ్ బస్సులను నడుపుతున్నామన్నారు. ఇందుకోసం రూ.29.40 కోట్లు ఖర్చు చేశామన్నారు. గరుడ సేవ రోజున 3,41,100 మంది భక్తులను గమ్యం చేర్చడమే లక్ష్యంగా 514 బస్సులతో 3411 టిప్పులు తిప్పనున్నామన్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఈ సర్వీసులను కొనసాగిస్తామన్నారు. ఇందుకోసం 50 మంది అధికారులు, 200 మంది డ్రైవర్లు, 200 మంది కండక్టర్లు, 160మంది సెక్యూరిటీ సిబ్బంది, 50 మంది డ్రైవర్ శిక్షకులను ప్రత్యేకంగా రప్పించామన్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు జీపీఎస్ సిస్టమ్‌ను అనుసంధానం చేశామని, తిరుమల బస్సులకు కూడా త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. తిరుమలకు వెళ్లేటప్పుడు 25 నిమిషాలు, తిరుపతికి వచ్చేటప్పుడు 40 నిమిషాల సమయం పాటించాలని, ఆలాకాకుండా ఎవరైనా మితిమీరిన వేగంతో ముందుగానే గమ్యస్థానాలకు చేరుకుంటే అలాంటి డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నారు. శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోరిక మేరకు తిరుపతి రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి వారు కోరిన బస్సులను రోజువారి అద్దెకు బస్సులను కేటాయిస్తామన్నారు. తక్కువ చార్జీలతో, సురక్షితమైన ప్రయాణం కోసం అయ్యప్ప భక్తులు ఆర్టీసీ బస్సులను తమ శబరిమల యాత్రకు వినియోగించుకోవచ్చని అన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎలాంటి పర్మిట్ల సమస్యలు ఉండవని, బస్ బుక్ చేసుకున్న గురుస్వామి, ఏటీడీ ఏజెంట్‌కు రూ. 1000 కమీషన్ కూడా ఇస్తామన్నారు. రోజువారి అద్దెను 480 కిలోమీటర్లకు కాకుండా 420 కిలోమీటర్లకే పరిగణిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతోపాటు ఇతరులకు కూడా బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి రూ. 2కోట్లతో కొటాల వద్ద డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి నుంచి బెంగళూరుకు 60, చెన్నయ్‌కి 20, హైదరాబాదుకు 15, విజయవాడకు 10 అదనపు బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో తిరుపతి డిప్యూటీ సీటీఎం మధుసూధన్, ఏటీఎం భాస్కర్ రెడ్డి, పీఆర్వో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఎస్వీయూ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేద్దాం
* వీసీ ఆచార్య దామోదరం పిలుపు
తిరుపతి, అక్టోబర్ 12: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈసారి ఒకేసారి 56, 57వ స్నాతకోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అందరూ కలిసి పనిచేయాలని ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 55వ స్నాతకోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించనట్లే ఈ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల విభాగానికి సంబంధించి డిగ్రీలు, గోల్డ్‌మెడల్స్ సిద్ధంగా ఉన్నా, మిగిలిన వాటిని ఈనెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని పరీక్షల విభాగాన్ని ఆదేశించారు. రెండు సంవత్సరాలకు సంబంధించిన స్నాతకోత్సవం ఒకేసారి నిర్వహించినా శ్రీనివాస ఆడిటోరియం సరిపోతుందని తెలిపారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు సకాలంలో పనులను పూర్తి చేయాలన్నారు. కన్వీనర్లు ఆయా కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించి ఒక ప్రణాళిక బద్దంగా పనులను పూర్తి చేయాలన్నారు. రెక్టార్ జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్కే అనూరాధ, ఇంజినీర్ అజయ్‌బాబు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్, డీన్లు, అన్ని కమిటీల కన్వీనర్లు పాల్గొన్నారు.
12 టిపిటి 5. ఎస్వీయులోని వీసీ చాంబర్‌లో వివిధ విభాగాల విభాగాధిపతులతో సమావేశమైన వీసీ ఆచార్య ఆవుల దామోదరం

శ్రీవారి భక్తులకు సేవలందిస్తున్న స్విమ్స్ సిబ్బంది
తిరుపతి, అక్టోబర్ 12: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వస్తున్న భక్తులకు అలిపిరి, శ్రీవారి మెట్ల వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ల ద్వారా స్విమ్స్ వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు నడక మార్గంలో వెళ్లే భక్తులకు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. అలాగే మందులను పంపిణీ చేస్తున్నారు.