క్రైమ్/లీగల్

వివాహిత అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 28: స్థానిక కొర్లగుంటకు చెందిన లావణ్య అనే వివాహిత ఆదివారం తెల్లవారు జామున ఇంటిలోని వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండటంపై ఆమె తల్లి, స్థానికులు ఆమె భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉడ్ వర్క్ చేసుకుని జీవించే ఈశ్వర్ ప్రేమ పేరుతో లావణ్య వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉంది. ఈశ్వర్ పరస్ర్తి వ్యామోహంలో పడి తరచూ ఇంటికి తీసుకు వచ్చేవాడని, దీనిని ప్రశ్నించిన లావణ్యను మద్యం సేవించి వచ్చి కొట్టేవాడు. దీనిపై గతంలో అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. అయినా ఈశ్వర్ తీరు మారలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లావణ్య ఇంటిలోని వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు లావణ్య తల్లి కమలమ్మకు భర్త ఈశ్వర్ ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వచ్చే సరికే ఉరివేసుకుని ఉన్న లావణ్య మృతదేహాన్ని కింద పడుకోపెట్టాడు. ఉరివేసుకుని ఉన్న లావణ్య మృతదేహాన్ని కదలించవద్దని, పోలీసులు వచ్చే వరకు అలాగే ఉంచాలన్నా ఈశ్వర్ వినలేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఈస్ట్ సీఐ చంద్రమోహన్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.